China: చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం.. తైవాన్ ర‌క్ష‌ణ శాఖ వెబ్‌సైట్ హ్యాక్

తైవాన్‌కు స‌మీపంలో స‌ముద్ర జ‌లాల్లో చైనా భారీ ఎత్తున‌ సైనిక విన్యాసాలు చేప‌ట్టింది. ఈ నెల 7 వ‌ర‌కు చైనా సైనిక విన్యాసాలు కొన‌సాగించనుంది. ఇప్ప‌టికే స‌రిహ‌ద్దుల వ‌ద్ద యుద్ధ విమానాల‌తో చ‌క్క‌ర్లు కొట్టి చైనా క‌ల‌క‌లం రేపింది. తాము యుద్ధాన్ని కోరుకోవ‌ట్లేద‌ని, అయితే, యుద్ధం వ‌స్తే ఎదుర్కోవ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్నామ‌ని తైవాన్ ప్ర‌క‌టించింది. విభేదాలు పెరిగే విధంగా తాము వ్య‌వ‌హ‌రించ‌బోమ‌ని ఇవాళ‌ పేర్కొంది.

China: చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం.. తైవాన్ ర‌క్ష‌ణ శాఖ వెబ్‌సైట్ హ్యాక్

China-Taiwan conflict

China: చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తైవాన్‌కు స‌మీపంలో స‌ముద్ర జ‌లాల్లో చైనా భారీ ఎత్తున‌ సైనిక విన్యాసాలు చేప‌ట్టింది. ఈ నెల 7 వ‌ర‌కు చైనా సైనిక విన్యాసాలు కొన‌సాగించనుంది. ఇప్ప‌టికే స‌రిహ‌ద్దుల వ‌ద్ద యుద్ధ విమానాల‌తో చ‌క్క‌ర్లు కొట్టి చైనా క‌ల‌క‌లం రేపింది. తాము యుద్ధాన్ని కోరుకోవ‌ట్లేద‌ని, అయితే, యుద్ధం వ‌స్తే ఎదుర్కోవ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్నామ‌ని తైవాన్ ప్ర‌క‌టించింది. విభేదాలు పెరిగే విధంగా తాము వ్య‌వ‌హ‌రించ‌బోమ‌ని ఇవాళ‌ పేర్కొంది.

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో ప‌ర్య‌టించ‌డం ప‌ట్ల చైనా తీవ్ర ఆగ్ర‌హంతో ర‌గిలిపోతోంది. తైవాన్‌ చూట్టూ మొత్తం ఆరు ప్రాంతాల్లో విధ్వంసకర సైనిక విన్యాసాలను చైనా ప్రారంభించింది. తైవాన్‌ నౌకాశ్రయాలతో పాటు వాటికి ద‌గ్గ‌ర‌లోని ప్రాంతాలకు చైనా నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు తైవాన్ భావిస్తోంది. తాము ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఎవ‌రికీ తల వంచే ప్రసక్తే లేదని తైవాన్ ఇప్ప‌టికే చెప్పింది.

తైవాన్‌ అధ్యక్షురాలు ట్సాయ్‌ ఇంగ్‌ వెన్ తాజాగా మాట్లాడుతూ ఈ విష‌యాన్ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు, తైవాన్‌లో సైబ‌ర్ దాడులు జ‌రుగుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తైవాన్ ర‌క్ష‌ణ శాఖ వెబ్ సైట్ సైబ‌ర్ దాడుల‌కు గురైంది. ఇప్ప‌టికే ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌డింది. ఇప్పుడు తైవాన్-చైనా మ‌ధ్య యుద్ధ భ‌యం నెల‌కొన‌డంతో ప్ర‌పంచ దేశాల‌పై ఈ ప్ర‌భావం మ‌రింత ఉండే అవ‌కాశం ఉంది.

COVID19: దేశంలో కొత్త‌గా 19,893 క‌రోనా కేసులు