China-Taiwan Conflict : తైవాన్‌ను చైనా టార్గెట్‌ చేయడానికి కారణాలు ఏంటి? తైవాన్‌ మాదేనని చైనా ఎందుకు చెప్తోంది?

తైవాన్‌ను చైనా టార్గెట్‌ చేయడానికి కారణాలు ఏంటి? అసలు చైనాలో తైవాన్‌ కూడా ఓ భాగమేనా? తైవాన్‌ మాదేనని చైనా ఏం చూసుకుని చెప్తోంది? చరిత్ర ఏం చెబుతోంది?

China-Taiwan Conflict : తైవాన్‌ను చైనా టార్గెట్‌ చేయడానికి కారణాలు ఏంటి? తైవాన్‌ మాదేనని చైనా ఎందుకు చెప్తోంది?

China Taiwan Conflict

China targeting Taiwan : తైవాన్‌ను చైనా టార్గెట్‌ చేయడానికి కారణాలు ఏంటి? అసలు చైనాలో తైవాన్‌ కూడా ఓ భాగమేనా? తైవాన్‌ మాదేనని చైనా ఏం చూసుకుని చెప్తోంది? చరిత్ర ఏం చెబుతోంది? దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్. 1949నాటి సివిల్ వార్ సమయంలో చైనా, తైవాన్ లు విడిపోయాయి. అయినప్పటికీ తైవాన్‌ను తమ దేశంలో కలుపుకోవడానికి దశాబ్దాలుగా చైనా ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అటు తైవాన్‌ ప్రజలుగానీ, ఇటు తైవాన్‌ ప్రభుత్వం కానీ ఏనాడూ సుముఖత వ్యక్తం చేసిన దాఖలా లేదు. అయినా సరే ఏదో ఏదోఒకరోజు అవసరమైతే ఒలవంతంగానైనా తైవాన్‌ను తమ ఆధీనంలో తెచ్చుకుంటామని చెప్తూ వస్తోంది చైనా.

తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. కానీ స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా, అధికారికంగా చైనా నుంచి దానికి స్వతంత్రం లభించలేదు. చైనా మాత్రం ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగానే పరిగణిస్తోంది. 1980 దశకంలో చైనా-తైవాన్ మధ్య సంబంధాలు కొంత మేర మెరుగుపడ్డాయి. అందులో భాగంగానే ‘ఒక దేశం- రెండు వ్యవస్థలు’ అనే సూత్రాన్ని చైనా తీసుకొచ్చింది. తమతో కలిసిపోవడానికి ఒప్పుకుంటే, పాలనలో స్వతంత్రతను కల్పిస్తామని చైనా ఆశ చూపినా తైవాన్‌ నో అనేసింది.

Also read : Biden Warn to China : తైవాన్‌ జోలికొస్తే సహించేది లేదంటూ చైనాకు అమెరికా వార్నింగ్..

చైనాకు, తైవాన్‌కు లింక్‌ తెలుసుకోవాలంటూ చరిత్రపుటలు తిరిగేయాల్సిందే. చైనానుంచి వలస వెళ్లిన ఆస్ట్రోనేషియన్‌ గిరిజన ప్రజలు తొలిసారిగా తైవాన్‌లో స్థిరపడినట్టు చరిత్ర చెప్తోంది. క్రీ.శ.239లో తమ దేశానికి చెందిన యాత్రికులు తైవాన్‌ను మొదట గుర్తించినట్లు చైనా రికార్డులు చూపెడుతున్నాయి. అందుకే తైవాన్‌ తమ దేశంలో భాగమేనని చైనా వాదిస్తోంది. 1624-1661 మధ్య డచ్ పాలకుల అధీనంలో ఉన్న తైవాన్, ఆ తర్వాత 1683-1895 వరకు అంటే 200 ఏళ్లకు పైగా చైనాకు చెందిన క్వింగ్ సామ్రాజ్యం పాలనలోనే కొనసాగింది.

కానీ ఆ తర్వాత 17వ శతాబ్దం ప్రారంభంలో చైనాలోని కఠిన పరిస్థితులను తాళలేక ప్రధానంగా ఫ్యూజియన్‌, గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో తైవాన్‌కు వలస వెళ్లారు. ప్రస్తుతం తైవాన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ఎక్కువ మంది ఆ రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన వారి వారసులే. 1895లో మొదటి సైనో-జాపనీస్ యుద్ధంలో క్వింగ్‌ ప్రభుత్వం ఓడిపోవడంతో తైవాన్.. జపాన్ అధీనంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తైవాన్‌ పై నియంత్రణను జపాన్ వదులుకుంది. అమెరికా, బ్రిటన్ దేశాల అనుమతితో తైవాన్‌పై మళ్లీ చైనా పెత్తనం మొదలైంది.

Also read : Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన

కొన్నేళ్లకు చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి చైనా నాయకుడు షియాంగ్ కై-షెక్ బలగాలను మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు బలగాలు చిత్తు చేశాయి. దాంతో షియాంగ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న దాదాపు 15లక్షల మంది ప్రజలు తైవాన్‌కు వలసపోయారు. తైవాన్ జనాభాలో వాళ్ల సంఖ్య 14శాతమే అయినా, చాలా ఏళ్ల పాటు వాళ్లే అక్కడి రాజకీయాలను శాసించారు. చనిపోయేవరకు షియాంగ్‌ తైవాన్‌ను పాలించాడు. ఆ తరువాత షియాంగ్ కొడుకు షియాంగ్ చింగ్-కో అధికారం చేపట్టాడు. కానీ, తైవాన్‌లో ప్రజాస్వామ్య ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆయన 2000 సంవత్సరంలో ఎన్నికలకు అనుమతిచ్చాడు. అలా తైవాన్‌లో తొలిసారి షియాంగ్ కుటుంబ పాలన ముగిసింది. తైవాన్‌కు ఇప్పుడు సొంత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నేతలు ఉన్నారు. సాయుధ బలగాలు వున్నాయి. కానీ కేవలం కొన్ని దేశాలు మాత్రమే తైవాన్ ను ఓ దేశంగా గుర్తిస్తున్నాయి. చైనా మాత్రం తమ దేశంలో అంతర్భాగమంటోంది. తైవాన్‌ పై పూర్తిస్థాయిలో పట్టుసాధించేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తోంది.