కన్నీటిని తాగేస్తున్నాయి : ఆమె కంట్లో తేనెటీగలు

తేనెటీగలంటే అందరికి భయమే. తేనెటీగలు వెంటపడి దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే భయమేస్తోంది కదా? అలాంటి తేనెటీగలు మీ కంటిరెప్ప లోపలి భాగంలో ఉంటే తట్టుకోగలరా?

  • Published By: sreehari ,Published On : April 10, 2019 / 10:56 AM IST
కన్నీటిని తాగేస్తున్నాయి : ఆమె కంట్లో తేనెటీగలు

తేనెటీగలంటే అందరికి భయమే. తేనెటీగలు వెంటపడి దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే భయమేస్తోంది కదా? అలాంటి తేనెటీగలు మీ కంటిరెప్ప లోపలి భాగంలో ఉంటే తట్టుకోగలరా?

తేనెటీగలంటే అందరికి భయమే. తేనెటీగలు వెంటపడి దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే భయమేస్తోంది కదా? అలాంటి తేనెటీగలు మీ కంటిరెప్ప లోపలి భాగంలో ఉంటే తట్టుకోగలరా? థైవాన్ కు చెందిన 29ఏళ్ల యువతికి ఇలాంటి ఈ వింత అనుభవమే ఎదురైంది. కొన్నివారాలుగా ఆమె కంటిలో తీవ్రనొప్పితో బాధపడుతోంది. తట్టుకోలేనంత నొప్పి.. పైగా కంటిరెప్ప బూరెలా ఉబ్బిపోయింది. కంటి నుంచి దారళంగా నీళ్లు కారుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక, థైవాన్ యువతి, ఆమె కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. కంటికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని ఓసారి వైద్యునికి చూపించారు.
Read Also : ఆర్బీఐకి హైకోర్టు ప్రశ్న: Google Payకు లైసెన్స్ ఉందా?

ప్రపంచంలోనే ఫస్ట్ కేసు :
యువతి కంటిని పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. యువతి కంటిరెప్ప కింద నాలుగు చిన్న తేనెటీగలు ఉన్నట్టు గుర్తించారు. మైక్రోస్కోప్ ఆధారంగా కనుగుడ్డు పొరపై ఉన్న నాలుగు చిన్న తేనెటీగలను వైద్యులు గుర్తించినట్టు స్థానిక మీడియా ఒక ప్రకటనలో తెలిపింది. కంటి పైపొరపై ఉన్న నాలుగు తేనెటీగలు ఆమె కంటిలోని తేమను, ఉప్పుతో కూడిన కన్నీళ్లను తాగుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇలాంటి కేసు.. ప్రపంచంలోనే తొలి వింత కేసు అంటూ వైద్యులు వర్ణించారు. అదృష్టం ఏమిటంటే.. యువతి తన కళ్లను రుద్దడం నలపడం చేయలేదని, లేదంటే ఆ ఇన్ఫెక్షన్.. కనుగుడ్డుపై శుక్లమండలం దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఉండేదన్నారు. 

తేనెటీగలు.. యువతి కంట్లోకి ఎలా? 
అసలు ఈ తేనెటీగలు యువతి కంట్లోకి ఎలా వెళ్లాయంటే.. తన బంధువుకు సంబంధించిన సమాధిని శుభ్రం చేస్తున్న సమయంలో ఎగిరిన కొన్ని తేనెటీగలు ఆమె కంట్లోకి వెళ్లి ఉండవచ్చునని బిజినెస్ ఇన్ సైడర్ సింగపూర్ కథనం చెబుతోంది. అప్పటినుంచి యువతి అసౌకర్యంగా ఫీలవుతుండేదని, కంట్లో నుంచి తరచూ నీళ్లు కారుతుండేవని తెలిపింది. అయితే.. తొలుత కంట్లో ఏదో నలుసు, ఇసుక పడి ఉండొచ్చునని భావించి.. ముందుగా నీళ్లతో కంటిని శుభ్రపరిచింది. అయినప్పటికీ కంటిబాధ నుంచి ఎలాంటి ఉపశమనం పొందలేదు. సాయంత్రానికి కంటినుంచి తీవ్రస్థాయిలో నొప్పి మొదలైందని, కంటినుంచి ధారళంగా నీరు కారడమే కాకుండా కంటిరెప్ప భారీస్థాయిలో వాచింది. దీంతో వెంటనే యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

తేనెలా పీల్చేస్తున్నాయి:
థైవాన్ లో ఫూయిన్ యూనివర్శిటీకి చెందిన వైద్యులు.. బాధిత మహిళ కంటిని పరీక్షించి.. చిన్న పరిమాణంలో ఉన్న 4 తేనెటీగలు ఉన్నట్టు గుర్తించారు. కంటిలో స్రవించే నీటిని ఆ తేనెటీగలు తేనెలా తాగేస్తున్నట్టు మైక్రోస్కోప్ ద్వారా వైద్యులు గుర్తించారు. వెంటనే యువతికి ట్రీట్ మెంట్ చేసిన ప్రొఫెసర్ చి-టింగ్.. ఆ తేనెటీగల (బతికే ఉన్న)ను ఒకదాని తరువాత మరొకటి కంటి నుంచి బయటకు తీసివేసినట్టు చెప్పారు. ‘మైక్రోస్కోప్ లో పరీక్షిస్తున్న సమయంలో యువతి కంటిలో ఏదో కీటకం కాళ్లులాగా కనిపించాయి. మెల్లగా వాటి శరీరం విడిపోకుండా బయటకు లాగేశాను’ అని మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. ప్రస్తుతానికి యువతి కోలుకుంటోందని, ఈసారి బంధువుల సమాధుల దగ్గరకు వెళ్లినప్పుడు కళ్లజోడు ధరించి వెళ్లాలని సూచించినట్టు వైద్యులు హంగ్ తెలిపారు. 
Read Also : స్పామర్లకు ట్విట్టర్ షాక్ : రోజుకు 400 ఫాలోవర్స్ మాత్రమే