రాబోయే 15 ఏళ్లలో మనుషులు అంతరిక్షంలోని ఉల్క బెల్ట్ కాలనీలో జీవించవచ్చు!

రాబోయే 15 ఏళ్లలో మనుషులు అంతరిక్షంలోని ఉల్క బెల్ట్ కాలనీలో జీవించవచ్చు!

Humans could move to floating asteroid belt colony : మరగుజ్జు గ్రహం సెరెస్.. భూగర్భ ఉప్పు నీటితో నిండి ఉంటుంది. ఈ గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. అంగారక గ్రహం బృహస్పతి మధ్య ఉల్క బెల్ట్‌లోనే ఉంటుంది. అంతర్గత సౌర వ్యవస్థలో ఉన్న ఏకైక మరగుజ్జుగా సెరెస్‌ను పిలుస్తారు. రాబోయే 15 ఏళ్లలో అంతరిక్షంలోకి మానువులు వెళ్లి ఈ ఉల్క బెల్టు కాలనీలోకి వెళ్లి జీవించవచ్చునంట.. అంగారక గ్రహం, బృహస్పతి మధ్య ఉల్క బెల్ట్‌లో తేలియాడే భారీ కక్ష్యలపై మానవులు ఉండేందుకు అనువైన ప్రదేశమంటున్నారు సైంటిస్టులు. 2026 నాటికి లక్షలాది మంది అంతరిక్షంలో మెగాసిటీలో నివసించవచ్చని సైంటిస్టు పెక్కా జాన్హునెన్  (Pekka Janhunen) చెబుతున్నారు.

భూమి నుంచి సుమారు 325 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న మరగుజ్జు గ్రహం సెరెస్ చుట్టూ ‘మెగా-ఉపగ్రహాలు’ తేలియాడుతుంటాయి. వీటికి సంబంధించి పలు అంశాలను ఆయన వెల్లడించారు. కృత్రిమ గురుత్వాకర్షణతో ఉల్క బెల్టు కాలనీలో మనుషులు నివసించడం సాధ్యమేనని చెబుతున్నారు. ఇక్కడి కాలనీలో డిస్క్ ఆకారపు నివాసం వేలాది స్థూపాకార నిర్మాణాలను కలిగి ఉంటుంది.

ఇందులోని ప్రతి ఇల్లు 50వేల మందికి పైగా నివాసం ఉండేందుకు అనువుగా ఉంటుందంట. అక్కడి పాడ్‌లు శక్తివంతమైన అయస్కాంతాల ద్వారా అనుసంధామై ఉంటాయి. దాంతో నెమ్మదిగా తిరుగుతూ కృత్రిమ గురుత్వాకర్షణను ఉత్పత్తి చేస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. నివాసితులు సెరెస్ నుంచి 600 మైళ్ల దిగువన ఉన్న వనరులను స్పేస్ ఎలివేటర్లను ఉపయోగించి తిరిగి తీసుకువెళతారని డాక్టర్ జాన్హునెన్ చెప్పారు.

సెరెస్ మరుగుజ్జు గ్రహం.. తక్కువ గురుత్వాకర్షణ కలిగి ఉండటంతో వేగంగా తిరుగుతుంది. దీనికి స్పేస్ ఎలివేటర్ సాధ్యమే అంటున్నారు. సెరెస్ మరుగుజ్జు గ్రహం.. గ్రహశకలం బెల్ట్‌లోని అతిపెద్ద వస్తువు. నత్రజని అధికంగా ఉన్న వాతావరణం ఇది.. అంగారకుడిపై కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న వాతావరణాన్ని భూమి లాంటి పరిస్థితులను తేలికగా సృష్టించవచ్చునని సైంటిస్టులు చెబుతున్నారు. మెగా-ఉపగ్రహం చుట్టూ స్థూపాకార నిర్మాణాలు అన్ని రకాల బాంబు దాడుల నుండి రక్షించగలవని జాన్హునెన్ అంటున్నారు. మొక్కల పెరుగుదలకు సూర్యరశ్మిని ఆవాసాలపై కేంద్రీకరిస్తాయంట. 2015లోనే అక్కడికి నాసా దీనిపై ఒక యాత్ర చేపట్టింది. ఈ యాత్రకు ఎనిమిది ఏళ్లు పట్టిందంట.