Recession Effect : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే ఏయే రంగాలపై ప్రభావం పడుతుంది? సామాన్యులక ఇబ్బందులు తప్పవా? భారత్‌లో పరిస్థితులేంటీ?

Recession Effect : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే ఏయే రంగాలపై ప్రభావం పడుతుంది? సామాన్యులక ఇబ్బందులు తప్పవా? భారత్‌లో పరిస్థితులేంటీ?

Recession effect In India

Recession effect In India : ఆర్థికమాంద్యం రాకముందే పరిస్థితులు ఇలా ఉన్నాయ్. కాస్ట్ కటింగ్ పేరుతో.. కంపెనీలన్నీ ఉద్యోగులను తీసేస్తున్నాయ్. మరి.. నిజంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే ఏంటి పరిస్థితి? ఏయే రంగాలు ఎఫెక్ట్ కానున్నాయ్? సామాన్యులకూ ఇబ్బందులు తప్పవా? భారత్‌లో మాంద్యం ప్రభావం ఉంటుందా? ఇలా.. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చేస్తున్నాయ్.

ఇప్పటికే.. ఆర్థికమాంద్యం కారణంగా.. అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఫండింగ్ తగ్గిపోయి.. నిధుల కొరత ఏర్పడటంతో.. భారత్‌కు చెందిన 44 స్టార్టప్ కంపెనీలు కూడా 15 వేల 7 వందల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. వాటిలో.. బైజూస్‌, కార్స్‌24, ఓలా, మీషో, ఉడాన్‌ లాంటి యూనికార్న్‌ కంపెనీలు కూడా ఉన్నాయ్. ఉద్యోగాలు కోల్పోయిన 15 వేల మందిలో అత్యధికంగా విద్యారంగానికి చెందినవాళ్లే ఉన్నారు. బైజూస్‌ సహా 14 ఎడ్‌టెక్‌ కంపెనీలు.. ఈ ఏడాది 6 వేల 898 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. తర్వాత.. కస్టమర్ సర్వీస్, ఈ-కామర్స్ రంగాలకు చెందిన 26 స్టార్టప్ కంపెనీలు 13 వేల 5 వందల మందికి పైగా ఉద్యోగులను తీసేశాయి. తాజాగా.. జొమాటో కూడా దేశవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. జొమాటో ఉద్యోగుల సంఖ్య 3 వేల 8 వందలు కాగా.. కరోనా టైమ్‌లోనే 520 మందిని తీసేశారు. ఇలా.. కేవలం దిగ్గజ కంపెనీలు, కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీలే కాదు.. స్టార్టప్‌లు కూడా ఖర్చులు తగ్గించుకునేందుకు.. ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయ్.

IMF Warns..Recession : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ .. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయే ఛాన్స్.. అన్నింటికి సిద్ధమవ్వాలని సూచిస్తున్నIMF

ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లంతా లింక్డ్ ఇన్‌లో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మొన్నటిదాకా నేను పలానా కంపెనీలో పనిచేశాను. ఉన్నట్టుండి.. తమను ఉద్యోగంలో నుంచి తీసేశారని.. వాళ్లున్న పరిస్థితుల్లో ఉద్యోగం ఎంతో అవసరమని చెబుతున్నారు. అంతేకాదు.. కొత్త ఉద్యోగాలుంటే చెప్పాలని.. తమ జాబ్ ప్రొఫైల్‌ని లింక్డ్ ఇన్‌లో షేర్ చేస్తున్నారు. ఇలా.. పోస్టులు పెడుతున్న వారిలో దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులే ఉన్నారు. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోతున్న టెకీలకు చేయూతనిచ్చేందుకు.. జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ సంస్థ ముందుకొచ్చింది. కొలువుల విషయంలో నెలకొన్న సంక్షోభంతో.. ఇటీవలే ఓ ప్రకటన చేసింది. అదేమిటంటే.. సెల్ఫ్‌ డ్రైవింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌, మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ విభాగాలకు చెందిన 800 ఉద్యోగాలు తమ సంస్థలో ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన టెకీలకు ఇస్తామని ప్రకటించింది. ఇలాగే.. మరికొన్ని కంపెనీలు ముందుకొస్తే.. ఫైర్ అయిన టెకీలు మళ్లీ కోలుకునే అవకాశం ఉంటుంది.

Amazon founder Jeff Bezos : కార్లు,టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి..డబ్బులుంటే దాచుకోండి.. : జెఫ్ బెజోస్ సూచనల వెనుక పొంచి ఉన్న ఉపద్రవం

మాంద్యం ప్రభావం.. నెమ్మదిగా మిగతా రంగాలపైనా పడే చాన్స్ ఉంది. పనిచేసే సత్తా మీలో ఉన్నా.. పని చేయడానికి ఉద్యోగాలుండవు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కూడా పెరిగి.. ఒకరకమైన ఇబ్బందికర వాతావరణం అలుముకుంటుంది. అప్పుడు గనక చేతిలో డబ్బులు లేకపోతే.. పరిస్థితులు దారుణంగా ఉంటాయని జెఫ్ బెజోస్‌తో పాటు ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే.. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం పరిస్థితులు వస్తాయేమోనన్న ఆందోళనకర పరిస్థితులు నెలకొంటే.. భారత్‌లో మాత్రం ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చెబుతున్నారు. వచ్చే ఏడాది దేశ వృద్ధి రేటు 6 నుంచి 7 శాతం మధ్య నమోదు కావొచ్చని అంచనా వేశారు. ప్రపంచం మొత్తం మాంద్యంలోకి వెళ్లిపోయినా.. భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు ఉండవన్నారు. అయితే.. అమెరికా, ఐరోపా, జపాన్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉండటంతో.. ఆ దేశాల్లో మందగమనం వల్ల ప్రపంచం మొత్తం మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.

భారత్ వరకు ఆర్థికమాంద్యం ప్రమాదం లేకపోయినా.. వృద్ధి రేటుపై మాత్రం కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం సైతం మరికొన్ని నెలలు 6 నుంచి 7 శాతం మధ్యే కొనసాగొచ్చని.. తర్వాత కిందకు దిగొస్తుందని.. చెబుతున్నారు. ఇక.. ధరల పెరుగుదల అంశం మాత్రం ప్రధానంగా చమురు రేట్లపై ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో దిగుమతి చేసుకున్న వస్తు-సేవలను సామాన్యులు ఎక్కువగా వినియోగించరు. అందువల్ల.. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడినా.. పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే.. వాణిజ్య లోటు భారీగా పెరిగి ఉన్నందువల్ల.. ఎగుమతుల్ని పెంచే దిశగా భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల వారీగా ఎగుమతి విధానాల్ని రూపొందిస్తే.. కాస్త బెటర్‌గా ఉంటుందని సూచిస్తున్నారు.

IMF Warns About Recession : ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏ క్షణమైనా కుదేలవుతాయని హెచ్చరిస్తున్న IMF