Sri lanka crisis: వారం రోజుల్లో శ్రీలంకలో కీలక మార్పులు.. అధ్యక్షుడు గొటబయ సంచలన వ్యాఖ్యలు..

పొరుగు దేశమైన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనిని ఎదుర్కోవడంతో ప్రభుత్వం విఫలమైందని ఆ దేశ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కర్ఫ్యూ విధించినా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు...

Sri lanka crisis: వారం రోజుల్లో శ్రీలంకలో కీలక మార్పులు.. అధ్యక్షుడు గొటబయ సంచలన వ్యాఖ్యలు..

Sri Lanka Crisis

Sri lanka crisis: పొరుగు దేశమైన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనిని ఎదుర్కోవడంతో ప్రభుత్వం విఫలమైందని ఆ దేశ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కర్ఫ్యూ విధించినా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రధాని మహింద రాజపక్స వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత వారంపదిరోజులుగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రెండు రోజుల క్రితం తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కొద్దిగంటల్లోనే మహింద రాజపక్స ఇంటికి నిరసన కారులు నిప్పంటించి దగ్దం చేశారు. దీనికితోడు అధికార పార్టీకి చెందిన వారి పలు ఇళ్లను ధ్వంసం చేశారు. మహింద రాజపక్స మద్దతు దారులు నిరసన కారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో హింసాత్మకంగా మారింది.

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనకారులపై ‘షూట్ ఎట్ సైట్’ ఆదేశాలు ఉన్నాయి: ఆదేశ రక్షణశాఖ

ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులతో సహా తొమ్మిది మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన పలువురు నేతల ఆస్తులకు నిరసన కారులు నిప్పు పెట్టారు. ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. అల్లర్లను అణచివేయడానికి శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ ‘షూట్-ఆన్-సైట్’ ఆదేశాలను ప్రకటించింది. ఆందోళనకారులపై “కనిపిస్తే కాల్చివేత” ఆదేశాలు ఉన్నట్లు ఆదేశ రక్షణ మంత్రి పేర్కొన్నారు. కాగా బుధవారం ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎవరికి మెజారిటీ ఉంటే వారి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరో వారంరోజుల్లో కొత్త ప్రధానిని నియమించి మంత్రివర్గాన్ని ఎన్నుకుంటామని చెప్పారు. దేశంలో పరిస్థితులు దిగజారుతున్నాయని, హింసకు పాల్పడొద్దని ప్రజలకు గొటబయ రాజపక్స విజ్ఞప్తి చేశారు. సభకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ప్రవేశపెడతామని అన్నారు.

Sri lanka crisis: ప్రత్యేక హెలికాప్ట‌ర్‌లో వెళ్లి.. నౌకాశ్రయంలో తలదాచుకున్న శ్రీలంక మాజీ ప్రధాని!

దేశంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుస్థిరత వస్తుందని, ఇందుకోసం అన్ని పార్టీలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమయంలో ప్రజలను, ఆస్తులను కాపాడేందుకు అందరి సహకారం అవసరమన్నారు. హింసపై గోటబయ మాట్లాడుతూ.. గత వారం మొదలైన హింసను ఖండిస్తున్నానని, ఈ విషయమై విచారణకు ఉత్తర్వులు జారీ అయ్యాయని, హింస, హత్యలు, దహనం, విధ్వంసం, అలాంటి ఏ చర్యను సమర్థించబోమని అన్నారు. ఇదిలా ఉంటే శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సపై, ఆయన మద్దతు దారులపై నిరసనకారులు దాడులకు దిగుతున్నారు. రాజపక్స నివాసానికి నిప్పుపెట్టి న తరువాత రాజపక్స.. తన కుటుంబ సభ్యులతో కలిసి తలదాచుకొనేందుకు ట్రింకోమలీలోని నౌకాదళ స్థావరానికి వెళ్లారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత నడుమ తలదాచుకున్నాడు.