Kim Jong Un ‘seriously ill’ : కిమ్‌ జోంగ్ అనారోగ్యానికి దక్షిణ కొరియా కారణం అంటూ మండిపడ్డ సోదరి యో జోంగ్

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ కంటే ఆయన సోదరి యో జోంగ్ దక్షిణకొరియాపై మరోసారి ఫైర్ అయ్యారు. తన సోదరుడు కిమ్ అనారోగ్యానికి గురి కావటానికి పొరుగు దేశమైన దక్షిణ కొరియానే కారణం అంటూ ఆరోపించారు.

Kim Jong Un ‘seriously ill’ : కిమ్‌ జోంగ్ అనారోగ్యానికి దక్షిణ కొరియా కారణం అంటూ మండిపడ్డ సోదరి యో జోంగ్

Kim Jong Un 'seriously ill'

Kim Jong Un ‘seriously ill’ : ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ కంటే ఆయన సోదరి యో జోంగ్ అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని అంటారు. అటువంటి కిమ్ సోదరి తన సోదరుడు కిమ్ అనారోగ్యానికి గురి కావటానికి పొరుగు దేశమైన దక్షిణ కొరియానే కారణం అంటూ అంతెత్తున మండిపడ్డారు. నా సోదరుడు కిమ్ జోంగ్ ఉన్న తీవ్ర అనారోగ్యానికి గురి కావటానికి దక్షిణ కొరియానేకారణం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు యో జోంగ్.

గతంలో కూడా కిమ్ దక్షిణ కొరియా వల్లే తమ దేశంలోకి కోవిడ్ వ్యాపించింది అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇరు దేశాల సరిహద్దుల వెంట దక్షిణ కొరియా వైపు నుంచి వచ్చిన బెలూన్లు..ఇతర వస్తువుల కారణంగానే మా దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించింది అని కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు. దేశంలోకి కరోనా వ్యాప్తి చెందటానికి దక్షిణ కొరియాని బాధ్యులు చేస్తు ఆరోపణలు గుప్పించారు కిమ్.

Also read : North Korea : దక్షిణకొరియా నుంచి వచ్చే బెలూన్ల వల్లే మా దేశంలోకి కోవిడ్ వ్యాపించింది : కిమ్ జోంగ్

ఈక్రమంలో తన సోదరుడు అనారోగ్యానికి గురి కావటానికి కరోనా వైరస్‌ను కరపత్రాల ద్వారా ఉత్తర కొరియాలోకి వ్యాపిస్తున్నారంటూ మండిపడింది. వాటి వల్లే తన సోదరుడు కిమ్‌ జ్వరంబారిన పడ్డారని చెప్పుకొచ్చారు యో జోంగ్. ప్రజల కోసం నా సోదరుడు తనకు అనారోగ్యంగా ఉన్న లెక్క చేయకుండా ప్రజల గురించ ఆందోళన చెందారని ఒక్క క్షణమైనా బెడ్‌పై విశ్రాంతి తీసుకోలేదంటూ చెప్పుకొచ్చారు యో.

దీన్ని ఆసరా చేసుకుని కిమ్ సోదరి యో జోంగ్ మరోసారి దక్షిణ కొరియాకు వార్నింగ్‌ ఇచ్చారు. ‘వైరస్‌ను ప్రవేశపెట్టే కరపత్రాలను మా రిపబ్లిక్‌లోకి పంపేటం దక్షిణకొరియా మానుకోవాలని..లేదంటూ వైరస్‌ను మాత్రమే కాకుండా దక్షిణ కొరియా అధికారులను కూడా నిర్మూలించేలా మేం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ గురువారం (8,2022) వెల్లడించింది. కానీ తన సోదరుడు కిమ్‌ అనారోగ్యానికి గురి అయ్యింది ఎప్పుడు? ఆయనకు జ్వరం రావటానికి కారణమేంటి? కోవిడ్ బారిన పడ్డారా? అనే వివరాలను మాత్రం ఆమె చెప్పలేదు.

Also read :  North Korea: కొవిడ్‌పై గెలిచామని ప్రకటించిన కిమ్ జంగ్ ఉన్

ఇదిలా ఉంటే ఉత్తర కొరియాలో కరోనా వైరస్‌ వల్ల దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరం బారినపడుతున్నారు. కానీ కిమ్ మాత్రం తనదైన శైలిలో కరోనాను పూర్తిగా ఖతం చేసేసాం అని మాత్రం ప్రటించేశారు. కాగా, కరోనా టెస్టులు నిర్వహించని ఉత్తర కొరియా, కరోనాను కేవలం అదొక సాధారణ జ్వరంగా మాత్రమే పరిగణిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించని రెండు దేశాల్లో ఉత్తర కొరియా ఉండటం విశేషం. అంటే కరోనాను ఉత్తరకొరియా ఎంత లైట్ తీసుకున్నదో తెలుస్తోంది.