Maana Patel : టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి ఇండియన్ స్విమ్మర్ మానా పటేల్

భారత స్విమ్మర్ మానా పటేల్ కొత్త రికార్డు సృష్టించింది. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది మహిళా స్విమ్మర్ మనా పటేల్.

Maana Patel : టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి ఇండియన్ స్విమ్మర్ మానా పటేల్

Maana Patel

Maana Patel : జపాన్ ఒలింపిక్స్ క్రీడలకు ముస్తామైంది. ఐదు ఖండాలనుంచి ఆటగాళ్లు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన పతాకాలను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీని కోసం ఆయా దేశాలు క్రీడాకారులను సిద్ధం చేస్తున్నాయి. పతకాల పంట పండించి స్వదేశానికి సగర్వంగా రావాలని కోరుతున్నాయి. ప్రతీ క్రీడాకారుడి కల ఒలింపిక్స్ లో పాల్గొనాలని తపన పడతారు. దాని కోసం కసరత్తులు చేస్తారు.ఫిట్ నెస్ తో ప్రాక్టీసులు చేస్తుంటారు. ఒలింపిక్స్ కు ఎంపిక కావాలనీ.. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.

ఈ క్రమంలో భారత స్విమ్మర్ మానా పటేల్ కొత్త రికార్డు సృష్టించింది. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది భారతీయ మహిళా స్విమ్మర్ మనా పటేల్. తద్వారా మన దేశం నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా స్విమ్మర్‌గా, ఓవరాల్‌గా మూడో భారత్ స్విమ్మర్‌గా అరుదైన ఘనతను సాధించింది.

ఈ శుభ సందర్భంగా మనా పటేల్ మాట్లాడుతూ..”ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పటికప్పుడు గొప్ప అనుభూతిగా ఉంటుందని తప్పకుండా దేశంపరువు నిలబెడతానని ధీమా వ్యక్తంచేసారు మనా. ఉన్నత స్థాయి అథ్లెట్లతో ప్రదర్శన ఇవ్వడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని..పతకం సాధించి తీసుకురావటానికి నా శాయశక్తులా కృషి చేస్తానని..మాన పటేల్ తెలిపారు. ఇప్పటికే ఆమె ఖాతలో ఉన్న పతకాలకు లెక్కేలేదు.

అహ్మదాబాద్‌కు చెందిన బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మర్ అయిన మానా.. శ్రీహరి నటరాజ్, సంజన్ ప్రకాశ్‌తో కలసి భారత్ తరఫున ఒలింపిక్స్‌కు డైరెక్ట్ ఎంట్రీ కొట్టింది. మానా ప్రదర్శనపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్తం చేశారు. ఇదే ప్రదర్శనను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు రిజిజు ట్వీట్ చేశారు. 21 ఏళ్ల మానా పటేల్ జాతీయ గేమ్స్‌లో బ్యాక్‌స్ట్రోక్‌లో గోల్డ్ మెడల్స్ నెగ్గడం విశేషం.