Moon Mystery : చంద్రుడికి మరో ముఖం వుందా? నిండు జాబిలిపై ఆ మచ్చలేమిటి? సైన్స్‌ ఏం చెప్తోంది?

చంద్రుడికి మరో ముఖం వుందా? నిండు జాబిలిపై ఆ మచ్చలేమిటి? ఈ మిస్టరీ గురించి సైన్స్‌ ఏం చెప్తోంది?

Moon Mystery : చంద్రుడికి మరో ముఖం వుందా? నిండు జాబిలిపై ఆ మచ్చలేమిటి? సైన్స్‌ ఏం చెప్తోంది?

Moon Mystery

Moon Mystery : చందమామ అంటే…పున్నమినాడు మనోహరంగా కన్పించే నిండు పూర్ణచంద్రుడు గుర్తుకు వస్తాడు. కానీ మనకు కన్పించేది చంద్రుడి ముందువైపు ముఖమే. మరి చంద్రుడికి మరో ముఖం వుందా? నిండు జాబిలిపై ఆ మచ్చలేమిటి? సైన్స్‌ ఏం చెప్తోంది? పైకి అందంగా, మనోజ్ఞంగా కన్పించే చంద్రుడు..మిస్టరీల పుట్ట. అక్కడ ఏర్పడిన మనిషి పాద ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్లు పడుతుందట. భూమ్మీద మన బరువు, చందమామపైకి వెళ్తే 16.5 శాతం మాత్రమే వుంటుందిట. ఏ వస్తుకైనా రెండు ముఖాలు వుంటాయి. ముందు కన్పించేది, ఆ వెనుక వుండేది. ఇదే సూత్రం చందమామకైనా వర్తిస్తుందని సైన్స్‌ చెప్తోంది. చంద్రుడికి రెండు వేర్వేరు ముఖాలున్నాయని, ఆ ముఖాల మధ్య చాలా తేడా ఉందని 1950-1960 మధ్య కాలంలోనే నాటి సోవియట్ రష్యా, అమెరికా మూన్ మిషన్లు వెల్లడించాయి. సాధారణంగా మనం చూసే చంద్రుని ముఖాన్నిసైన్స్‌లో లూనార్‌ మారియా అని పిలుస్తారు. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే చంద్రుని ముఖం మీద పెద్దపెద్ద నల్ల మచ్చలు కన్పిస్తాయి. కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ లావా సముద్రాలు ప్రవహించిన దానికి అవి చిహ్నాలని సైన్స్‌ చెప్తోంది.

Also read : China: చైనా హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌లపై భారత్‌కు ఎందుకంత ఆందోళన?బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్‌ నిర్మిస్తే భారత్‌కు నష్టమేంటీ?

చిత్రమేమిటంటే చంద్రుడి మరోవైపు.. అంటే మనకు కనిపించే ముఖానికి వెనుకవైపు ముఖంలో ఈ లావా ప్రవాహ గుర్తులేవీ కనిపించవు. అదే ఆ తేడానే ఇప్పటిదాకా ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా వుండిపోయింది. ఈ మిస్టరీని ఛేదించడానికి అమెరికా శాస్త్ర వేత్తలు ఓ అధ్యయనం చేశారు. మరి అధ్యయం తేల్చిందేమిటి? చంద్రునిపై ఆ మచ్చలేమిటి అని చెప్పింది? అవి లావా సముద్రాలు ప్రవహించిన దానికి అవి చిహ్నాలు కావు… వందల కోట్ల సంవత్సరాల కిందట ఓ మహా గ్రహ శకలం చంద్రుడిని ఢీకొట్టినప్పుడు అలా మచ్చలుగా ఏర్పడి వుండొచ్చని అభిప్రాయపడింది. కానీ ఇదీ కారణమని ఆ అధ్యయనం కూడా తేల్చి చెప్పలేకపోయింది. జరిగి వుండొచ్చని మాత్రమే అభిప్రాయపడింది. మరి అసలు నిజం ఏమిటి?

చంద్రునికి రెండు భిన్నమైన ముఖాలు వున్న మాట నిజమే…”చంద్రుడి మీద మనకు కనిపించే వైపుకు, కనిపించని అవతలి వైపుకు మధ్య గల అతిపెద్ద తేడాలకు.. ఈ చంద్ర ప్రాంతాల మీద రసాయనాల మిశ్రమానికి సంబంధం ఉంది అంటారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆఫ్ ఆండాలూసియాకు చెందిన ఖగోళభౌతిక శాస్త్రవేత్త జోస్ మారియా. చంద్రుడిని గ్రహశకలాలు ఢీకొనటం అనే అంశంలో నిపుణులైన జోస్ మారియా.. అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనాన్ని ఆమె సమర్థించలేదనే చెప్పాలి. మనకు కనిపించే చంద్రుడి ముఖం మీద ఘనీభవించిన లావా ప్రాంతాలు చాలా విస్తారంగా, ఎక్కువగా ఉన్నాయి. వాటిని సముద్రాలు అని పిలుస్తారు. అయితే చంద్రుడి ఆవలి వైపు ఈ సముద్రాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయని ఆమె అంటారు. అంతేగాక రసాయ మిశ్రమాల విషయంలో కూడా ఇప్పటివరకూ నిర్వహించిన అంతరిక్ష కార్యక్రమాల ద్వారా చంద్రుడి మీద కొన్ని నిర్దిష్టమైన మూలకాల పరిమాణాల్లో చాలా తేడాలు ఉన్నట్లు కూడా గుర్తించారని అన్నారు. ఉదాహరణకు.. పొటాసియం, టైటానియం, థోరియం, ఫాస్ఫరస్ వంటి ఇతర రేర్-ఎర్త్ గ్రూప్ మూలకాలు.. మనకు కనిపించే చంద్రుడి ముఖం మీద ఎక్కువ మోతాదుల్లో ఉన్నాయని వివరించారు. ఇదంతా చూస్తే రూపొందే క్రమంలో ఈ తేడాలు పుట్టటానికి కారణమైన ఏదో గొప్ప సంఘటనకు చంద్రుడు లోనై ఉంటాడని జోస్ మారియా అభిప్రాయపడ్డారు.

Also read : China: చైనా కుట్ర..ఆసియాలోనే అతిపెద్ద నదులను ఎండబెట్టే ప్రయత్నాలు..బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్‌ నిర్మాణం యోచన

సైన్స్‌కు డెడ్ ఎండ్‌ వుండదు. శోధనలకు, అధ్యయనాలు నిరంతరం సాగుతూనే వుంటాయి. చంద్రుడిలో దాగి వున్న రహస్యాలకు కూడా అంతం అంటూ వుండదు. ఆ జాబిల్లిలో అన్నీ రహస్యాలే. అన్నీ మిస్టరీలే! అణువణువూ శాస్త్రవేత్తలకు సవాలు విసురుతుంటాయి. చంద్రుని రెండు ముఖాల మధ్య వున్న తేడాపై చర్చోపచర్చలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. కొత్త కొత్త రహస్యాలను ఆవిష్కరిస్తున్నాయి.

చంద్రుని రెండు ముఖాల మధ్య వున్న తేడాపై కొత్త అధ్యయనాలు వెల్లడవుతూనే వున్నాయి. సౌత్‌ పోల్-ఏట్కెన్ బేసిన్‌ ఏర్పడటానికి కారణమైన భారీ గ్రహశకలం ఢీకొనటం వల్ల చంద్రుడి రెండు ముఖాల మధ్య ఈ తేడాలు వచ్చాయని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ కొత్త అధ్యయనం అభిప్రాయపడింది. అయితే సౌత్ పోల్-ఏట్కెన్ బేసిన్ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో ఉన్న భారీ కందకమని ఖగోళభౌతిక శాస్త్రవేత్త జోస్ మారియా అభిప్రాయపడ్డారు.

దాదాపు 2,500 కిలోమీటర్ల వ్యాసం, 12 కిలోమీటర్ల లోతు ఉన్న ఈ కందకం.. సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు, ఉపగ్రహాలన్నింటిలోకి – గ్రహశకలపు ఘాతం వల్ల ఏర్పడిన అతి పెద్ద నిర్మాణమని తేల్చారు. ఈ బేసిన్ చంద్రుడి మీద ఆవలివైపు ఉంటుందని గనుకే అది మనకు భూమి మీద నుంచి కనిపించదని అన్నారు.

Also read : Kodali Nani : పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి కొడాలి నాని

మన భూగ్రహం నుంచి ఆ బేసిన్ అంచు మాత్రమే కనిపిస్తుంది. ఆ కందకం అంచు 9 కిలోమీటర్ల ఎత్తైన పర్వత శ్రేణితో ఏర్పడిందని ఖగోళభౌతిక శాస్త్రవేత్త జోస్ మారియా అన్నారు. మరోవైపు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడి దక్షిణ ధృవం వద్ద తగిలిన ఓ భారీ ఘాతం…చంద్రుడి అంతర్గత స్వరూపాన్ని మార్చిందని మరో అధ్యయనం చెప్తోంది. సౌత్ పోల్-ఏట్కెన్ బేసిన్ ఏర్పడటానికి కారణమైన ఆ గ్రహశకలపు ఘాతం.. భారీ స్థాయి ఉష్ణ కెరటాన్ని రాజేసి ఉంటుందని, అది చంద్రుడి మీద వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ఉష్ణ కెరటం వ్యాపిస్తున్న క్రమంలో అనేక లవణాలను.. చంద్రుడి మీద మనకు కనిపించే వైపు తీసుకుని వచ్చి ఉంటుంది. ఉష్ణాన్ని సృష్టించే ఆ మూలకాలు భారీ స్థాయిలో ఉండటం వల్ల అగ్నిపర్వత చర్య జరిగి.. చంద్రుడి దగ్గరి ముఖం మీద లావా ప్రవాహాలను పుట్టించి ఉంటాయని అభిప్రాయపడ్డారు.

Also read : Banjara Hills Land : నగరంలో సీమ గ్యాంగ్ ? కబ్జాకు వెళ్లలేదు.. ఈవెంట్ కోసం వెళ్లారు – విశ్వప్రసాద్

అయితే ఈ చర్చ ఇంతటితో ముగియలేదు. ఓ మహా ఘాతం వల్ల పుట్టుకొచ్చిన వేడి.. చంద్రుడి అంతర్గత క్రమాన్ని ఎలా మారుస్తుంది? అలా మారటం వల్ల చంద్రుడి మాంటిల్‌లోని క్రీప్ పదార్థాలు ఎలా స్థానచలనం అవుతాయి అనేదానిపై శాస్త్రవేత్తలు శోధన చేశారు. చంద్రుడి అంతర్గత నమూనాలు.. ఆ క్రీప్ పదార్థాలు ఉపరితలం కింద అటూఇటూగా ఈక్వల్‌గా పంపిణీ అవుతాయని, అలా జరిగే పంపిణీకి.. సౌత్ పోల్-ఏట్కెన్ ఘాతం వల్ల పుట్టే ఉష్ణ కెరటం అంతరాయం కలిగిస్తుందని కొత్త అధ్యయనం చెప్తోంది. ఆ ఉష్ణ కెరటం చంద్రుడి పైపొర కిందికి విస్తరించటంతో.. ఆ పదార్థం మనకు కనిపించే చంద్రుడి ముఖంవైపు బయటకు వచ్చింది. అందువల్లే చంద్రుడికి సంబంధించిన అతి పెద్ద రహస్యాల్లో ఒక మిస్టరీకి ఈ అధ్యయనం విశ్వనీయమైన వివరణను ఇస్తోందని పరిశోధకులు అంటున్నారు. చంద్రుడి చరిత్రలో అతి పెద్ద సంఘటనల్లో సౌత్ పోల్-ఏట్కెన్ ఘాతం ఒకటని, ఈ అధ్యయనం ఆ రెండు అంశాలను ఒక దగ్గరకు చేరుస్తుందనే అభిప్రాయానికి వచ్చారు.