Covid : బాబోయ్.. ఒక్కరోజే 1106 కరోనా మరణాలు, ఆ దేశంలో ఇదే తొలిసారి

కరోనావైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం విలవిల..

Covid : బాబోయ్.. ఒక్కరోజే 1106 కరోనా మరణాలు, ఆ దేశంలో ఇదే తొలిసారి

Russia Covid

Covid : కరోనావైరస్ మహమ్మారి రష్యాలో మరోసారి పంజా విసురుతోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం విలవిలలాడిపోతోంది. తాజాగా రికార్డు స్థాయిలో కరోనా మరణాలు రికార్డ్ అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,106 మంది కోవిడ్ తో చనిపోయారు. రష్యాలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఇవే అత్యధిక మరణాలు. నిన్న 36వేల 446 మంది వైరస్ బారిన పడ్డారు.

Sextortion gang: వెబ్‌సైట్‌లో నగ్నంగా వీడియో కాల్స్‌..! 200మంది నుంచి రూ.22కోట్లు దోచేసిన జంట

రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతుండటంతో రష్యా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి పలు చర్యలు చేపట్టింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ ఏడు వరకు సెలవులు ప్రకటించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మ్యూజియం, థియేటర్లు, కన్సర్ట్‌ హాల్స్‌ వంటి ప్రదేశాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఉంది. అదీ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే.

60 ఏళ్లు పైబడి, టీకా తీసుకోని వ్యక్తులు ఇంట్లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులను ఆదేశించారు. మాస్కుల వినియోగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఒకవైపు కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తే.. అక్కడి ప్రజలు వాటిని విహార యాత్రలతో సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో విమాన టికెట్ల అమ్ముడయ్యాయని, హోటళ్లలో గదులు నిండిపోతున్నాయని, పర్యాటక ప్యాకేజీలకు డిమాండ్ పెరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

PM Kisan : రూ.6వేలు కాదు రూ.12వేలు.. రైతులకు కేంద్రం శుభవార్త..?

రష్యాలో ఇప్పటివరకు 83 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 2.3లక్షల మందికి పైగా మరణించారు. ఎక్కువమందికి టీకాలు తీసుకోకపోవడమే తాజా వైరస్ ఉద్ధృతికి కారణమని నిపుణులు అంటున్నారు. 146 మిలియన్ల జనాభాలో కేవలం 49 మిలియన్ల మంది మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదట టీకాను(స్పుట్నిక్ వి) ఆవిష్కరించిన రష్యాలో.. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. కరోనాపై పోరులో విజయం సాధించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని నిపుణులు నెత్తి నోరు బాదుకుని చెబుతున్నారు.

టీకాల ఆవశ్యకత గురించి గొంతు చించుకుని అరుస్తున్నారు. టీకా తీసుకుంటే కరోనా బారిన పడ్డా ప్రాణాలకు ముప్పు ఉండదని వివరిస్తున్నారు. ఇంత చెబుతున్నా.. ఇంకా చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. లేనిపోని అనుమానాలు, భయాలు, సందేహాలు, అపోహలతో టీకా తీసుకునేందుకు జంకుతున్నారు. ఇలాంటి అంశాలు మరోసారి కరోనావైరస్ మహమ్మారి విజృంభణకు కారణం అవుతున్నాయి.