Russia Nuclear weapons : రష్యా న్యూక్లియర్ దాడులు బెదిరింపులు .. గేమ్‌ ప్లాన్ రెడీ అంటున్న అమెరికా‌ .. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న జీ7 దేశాలు

న్యూక్లియర్ దాడులు చేయటానికైనా వెనుకాడం అంటున్న రష్యా బెదిరింపులపై అమెరికా స్పందించింది. రష్యా న్యూక్లియర్ దాడులు చేస్తే గేమ్‌ ప్లాన్ రెడీ అంటోంది అమెరికా‌ ..ఇటువంటి పరిణామాలు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటు జీ7 దేశాలు హెచ్చరిస్తున్నాయి.

Russia Nuclear weapons : రష్యా న్యూక్లియర్ దాడులు బెదిరింపులు .. గేమ్‌ ప్లాన్ రెడీ అంటున్న అమెరికా‌ .. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న జీ7 దేశాలు

G7 nations have warned Russia of "severe consequences" if chemical or nuclear weapons are used against Ukraine.

russia ukraine war..Nuclear weapons : రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఆందోళన కొనసాగుతోంది. ఆ యుద్ధం.. ఎక్కడ న్యూక్లియర్ వార్‌కు దారితీస్తుందోనన్న టెన్షన్ గ్లోబ్ వైడ్ కనిపిస్తోంది. పుతిన్ కూడా అణు దాడులకు వెనుకాడబోమని రెండు, మూడు సార్లు చెప్పారు. మరి.. రష్యా అన్నంత పని చేస్తుందా? అదే.. జరిగితే జరగబోయే పరిణామాలేంటి? పుతిన్ గనక అణు బాంబులను ప్రయోగిస్తే.. అగ్ర దేశాలు రియాక్షన్ ఎలా ఉండబోతోంది?

రష్యా.. యుక్రెయిన్‌పై దండెత్తిన మొదట్లో.. అంతా మూడో ప్రపంచ యుద్ధానికి.. ఇది మొదటి అడుగు అనుకున్నారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ముదిరితే.. రాబోయేది థర్డ్ వరల్డ్ వారేనన్న చర్చ కూడా సాగింది. ఇందుకు చాలా కారణాలున్నాయ్. అయితే.. తాజాగా మరో డిబేట్ మొదలైంది. అదే.. న్యూక్లియర్ వార్. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలో.. కెర్చ్ బ్రిడ్జ్ పేలుడు జరగడం, అది జరిగిన కొన్ని గంటల్లోనే.. యుక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ చాలా నగరాల్లో రష్యా సైన్యం విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. తాజా పరిణామాలతో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్.. యుక్రెయిన్‌పై అణు దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇప్పటికే.. తూర్పు యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను ఆక్రమించిన రష్యా.. వాటిపై ఎలాంటి దాడి జరిగినా.. రష్యాపై జరిగినట్లేనని పుతిన్ హెచ్చరించారు. అదే జరిగితే.. అణు దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ నోటి నుంచి న్యూక్లియర్ దాడుల ప్రస్తావన చాలా సార్లు వచ్చింది. క్రిమియాలో బ్రిడ్జ్ పేలిన తర్వాత.. దీనిపై మరింత ఆందోళన నెలకొంది. యుద్ధం ఇంకాస్త తీవ్రతరమైతే.. పుతిన్ ఏ నిమిషంలోనైనా.. అణు దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చనే టాక్ కూడా మొదలైంది. అదే జరిగితే.. యుక్రెయిన్ సర్వనాశనం అయిపోతుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే.. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో న్యూక్లియర్ దాడులకు కూడా అవకాశం ఉందన్న చర్చపై.. అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించింది. ఒకవేళ.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గనక అణు దాడులు చేయాలని నిశ్చయించుకుంటే.. అందుకు తగ్గట్లుగా తమ దగ్గర గేమ్ ప్లాన్ ఉందన్నారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. న్యూక్లియర్ బాంబులను గనక ప్రయోగిస్తే.. కచ్చితంగా యూఎస్ స్పందిస్తుందన్నారు. ఈ విషయంలో.. పెంటగాన్‌ను అడగాల్సిన అవసరం కూడా లేదన్నారు బైడెన్. యుక్రెయిన్‌పై యుద్ధంలో.. పుతిన్ అణ్వాయుధాలను ఉపయోగించినట్లయితే.. మంచికి చెడుకు మధ్య ప్రపంచమంతా యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు. తాజాగా ఓ అంతర్జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆయన ఈ కామెంట్స్ చేశారు. వీటిపై.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే.. అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు మాత్రం.. పుతిన్ న్యూక్లియర్ అటాక్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు.. ఎలాంటి సమాచారం లేదన్నారు.

ఇక.. పుతిన్ న్యూక్లియర్ అటాక్స్ చేస్తాడని కూడా తాను భావించడం లేదన్నారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. కానీ.. అణు దాడుల గురించి పుతిన్ మాట్లాడటం మాత్రం బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారి అణ్వాయుధం ఉయోగిస్తే.. తర్వాత అంచనాలన్నీ తలకిందులైపోతాయంటోంది అమెరికా. జరగరాని తప్పులు జరిగిపోతాయని.. తర్వాత ఏం జరుగుతుందో.. ఎవరికీ తెలియని.. బైడెన్ హెచ్చరిస్తున్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు.. పుతిన్ కోసం ఆఫ్ ర్యాంప్‌ను కనుగొనేందుకు యూఎస్ ప్రయత్నిస్తోందని.. గత వారమే బైడెన్ చెప్పారు. తాజాగా.. యుక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు.. పుతిన్ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించాడు. యుద్ధం విషయంలో పుతిన్ ఏమనుకుంటున్నారో తెలియదు గానీ.. అతను ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని ఆపేసి వెళ్లిపోవచ్చని.. రష్యాలో తన స్థానాన్ని నిలిపి ఉంచుకోవచ్చని బైడెన్ సూచించారు. యుక్రెయిన్ రాజధాని కీవ్‌ సహా ఇతర నగరాలపై.. రష్యా చేసిన మిస్సైల్ ఎటాక్స్ తర్వాత.. బైడెన్ నుంచి ఈ రియాక్షన్ వచ్చింది.

Crimea Bridge Attack: కెర్చ్ బ్రిడ్జి పేల్చివేతలో ఐదుగురు రష్యా జాతీయులు.. 23టన్నుల పేలుడు పదార్థాలు

అమెరికా, దాని మిత్ర దేశాలు.. యుక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలు అందించే విషయంలో.. ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు.. రష్యా అనుసరిస్తున్నట్లుగా.. ఆయుధాలను అందించడానికి అగ్ర దేశాలు ఇష్టపడటం లేదు. అయితే.. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ.. బైడెన్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఎయిర్ ఫోర్స్ తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. దీనికి.. బైడెన్ సానుకూలంగానే స్పందించారు. వైమానికదళంతో పాటు అధునాతన ఆయుధ పరికరాలను అందించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. యుక్రెయిన్‌పై దండయాత్ర విషయంలో.. పుతిన్ పొరపాటు పడ్డారని కూడా బైడెన్ కామెంట్ చేశారు. యుక్రెయిన్‌ను ప్రమాదకరమైన ఆయుధాలతో ధ్వంసం చేసే ముందు.. ఇప్పుడున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తే మంచిదన్నారు.

యుక్రెయిన్ చేతులు చాచి రష్యాను ఆహ్వానిస్తుందని.. పుతిన్ భావించారని.. అదే ఆయన చేసిన పొరపాటు అని చెబుతోంది అమెరికా. యుద్ధం మొదలై ఏడు నెలులు దాటినా.. ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వార్ విషయంలో.. పుతిన్ అంచనాలు తప్పడంతోనే.. అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమంటూ.. హెచ్చరిస్తున్నారని బైడెన్ చెబుతున్నారు. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు.. పుతిన్ అద్భుతంగా నటిస్తున్నారని కామెంట్ చేశారు జో బైడెన్.

Russia vs Ukraine War: రష్యాకు వ్యతిరేకంగా 143 దేశాలు.. ఓటింగ్‌కు దూరంగా భారత్

అయితే.. పుతిన్ ఇస్తున్న న్యూక్లియర్ వార్నింగ్స్, బైడెన్ చేస్తున్న హెచ్చరికలే.. ఇప్పుడు వరల్డ్ వైడ్ కొత్త చర్చకు దారితీశాయ్. ఒకవేళ.. పుతిన్ గనక యుక్రెయిన్‌పై న్యూక్లియర్ బాంబులను ప్రయోగిస్తే.. తర్వాత అమెరికా ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది? ఇప్పటికే.. యుద్ధంలో యుక్రెయిన్‌కు కావాల్సిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తున్న అమెరికా.. రష్యా గనక అణు దాడులకు దిగితే.. కౌంటర్‌గా యూఎస్ కూడా న్యూక్లియర్ అటాక్స్ చేసేందుకు సిద్ధంగా ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయ్. అదే గనక జరిగితే.. అసలైన ప్రపంచ యుద్ధం.. న్యూక్లియర్ వార్‌తోనే మొదలవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇక.. జీ7 దేశాలు కూడా రష్యా చేసిన దాడులపై.. జెలెన్‌స్కీతో సంప్రదింపులు జరిపాయి. ఆ దేశాలన్నీ.. రష్యాతో యుద్ధం జరిగినన్ని రోజులు.. యుక్రెయిన్‌కు తమ వంతు సాయం అందిస్తూనే ఉంటామనే ప్రకటనను కూడా విడుదల చేశాయి. ప్రస్తుతం యుక్రెయిన్‌కు ఎయిర్‌డిఫెన్స్‌ షీల్డ్‌ను అందించడమే తమ టాప్‌ ప్రియారిటీ అంటున్నాయి.