Sri Lanka Monkeys To China : శ్రీలంక నుంచి చైనాకు లక్ష కోతులు తరలింపు .. ప్రయోగాల కోసమేనా?

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఏకంగా తన దేశపు జంతువుల్ని కూడా అమ్మేసుకోవటానికి సిద్ధపడుతోంది. శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన కోతుల్ని లంక ప్రభుత్వం చైనాకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది.చైనా అడిగింది..లంక ఇవ్వాలని యోచిస్తోంది.

Sri Lanka Monkeys To China : శ్రీలంక నుంచి చైనాకు లక్ష కోతులు తరలింపు .. ప్రయోగాల కోసమేనా?

Sri Lanka Monkeys To China

Sri Lanka Monkeys To China  : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఏకంగా తన దేశపు జంతువుల్ని కూడా అమ్మేసుకోవటానికి సిద్ధపడుతోంది. శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన కోతుల్ని లంక ప్రభుత్వం చైనాకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. శ్రీలంక చైనాకు ఎగుమతి చేసే ఆకోతులు అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్నాయని IUCN చెబుతోంది. కానీ  శ్రీలంకలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని చైనా తన అవసరాలు తీర్చుకుంటున్నట్లుగా ఉందీ చైనా ఈ కోతుల దిగుమతి చేసుకునే విధానం చూస్తుంటే.

శ్రీలంక నుంచి లక్ష కోతుల్ని దిగుమతి చేసుకోవటానికి ప్రతిపాదన పెట్టింది చైనా. ఇంత భారీ సంఖ్యలో కోతుల్ని దిగుమతి చేసుకోవాలని చైనా అనుకోవటంపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ కోతులు ప్రయోగాల కోసమే దిగుమతి చేసుకుంటోంది  అనుమానాలు రేకెత్తుతున్నాయి. చైనా చేసిన ప్రతిపాదనపై శ్రీలంక ఆలోచిస్తోంది. శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన జాతికి చెందిన ‘టోక్ మకాక్‌’ కోతులను పంపించే విషయంపై ఆదేశపు ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేయాలని శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర సంబంధిత అధికారులకు సూచించారని బుధవారం (ఏప్రిల్,2023) ఓ న్యూస్ రావటం చర్చనీయాంశమైంది. శ్రీలంకలో ఈ కోతుల సంఖ్య అధికంగా ఉందని దీంతో చైనా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవచ్చని మహింద భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

చైనాలోని జూలలో ప్రదర్శనకు చైనా లక్ష కోతులను కోరిందని శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర వెల్లడించారు. కోతుల ఎగుమతి విషయంలో న్యాయపరమైన చిక్కులేమైనా ఉంటాయా? అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి క్యాబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించాలని నిర్ణయించారు.

కాగా..ప్రస్తుతం శ్రీలంకలో టోక్‌ మకాక్‌ కోతుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు అంచనా. ఇవి స్థానికంగా పంటలను దెబ్బతీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి సంతతిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదని..ఇటువంటి సమయంలో చైనా నుంచి కోతుల అభ్యర్థన వచ్చినట్లు చెబుతున్నారు.

మరి ఈ కోతులను ఉచితంగా ఇస్తారా? లేక కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అలాగే చైనా తమ జూలలో ప్రదర్శన కోసం అడుగుతోందా? లేదా వాటిపై ప్రయోగాలు చేయటానికి దిగుమతి చేసుకోవాలనుకంటోందా? అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. కాగా..శ్రీలంలో టోక్ మకాక్ కోతుల సంఖ్యలో భారీగా పెరిగి పంటల నష్టం కలుగుతోందని ప్రభుత్వం చెబుతుండగా..శ్రీలంకలో మాత్రమే కనిపించే ‘టోక్‌ మకాక్‌’ జాతి కోతులు రెడ్ లిస్టులో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) వెల్లడించటం గమనించాల్సిన విషయంగా ఉంది.

కోతుల్ని చైనాకు తరలించేందుకు చర్చిందుకు మంత్రి మహింద నేషనల్ జూలాజికల్ గార్డెన్స్ శాఖ, వన్యప్రాణి సంరక్షణలు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. శ్రీలంకలో ప్రస్తుతం కోతుల సంఖ్య దాదాపు 3 మిలియన్లకు చేరుకుందని, స్థానిక పంటలకు జంతువులు పెనుముప్పుగా ఉన్నాయని సమావేశంలో అధికారులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దీంతో అసలే ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో కోతుల్ని చైనాకు తరలించటానికి మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం.