సంకెళ్లు వేసుకున్న ప్రేమ : కలిసే భోజనం, పడుకోవడం,టాయిలెట్ కూడా అలాగే..!!

సంకెళ్లు వేసుకున్న ప్రేమ : కలిసే భోజనం, పడుకోవడం,టాయిలెట్ కూడా అలాగే..!!

Ukrainian couple CHAIN : ప్రేమికులు చెట్టాపెట్టాలేసుకుని తిరగడం చూస్తుంటాం. పార్క్ లు, సినిమా థియేటర్లు, ఇతర ప్రాంతాలకు కలిసి వెళుతున్నారు. బీచ్ ల్లో తిరుగుతూ..ఎంజాయ్ చేస్తుంటారు. కానీ..ఓ జంట మాత్రం చేతులను ఛైన్ తో కట్టేసుకుని గడుపుతున్నారు. కలిసే పడుకుంటున్నారు..కలిసే భోజనం చేస్తున్నారు..కలిసే…టాయిలెట్ కు వెళుతున్నారు. అసలు ఎందుకు గొలుసులు తీయడం లేదు. దీనికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.

ఉక్రెయిన్ కు చెందిన అలెగ్జాండర్, విక్టోరియాలు ప్రేమికులు. ఒకరంటే..మరొకరికి అమితమైన ప్రేమ. అయితే..ప్రేమ ఎంత గొప్పదో..ప్రపంచానికి తెలియచెప్పాలని అనుకున్నారు. అందుకు వినూత్నమైన మార్గం ఎంచుకున్నారు. ఛైన్ అటాచ్ మెంట్ ద్వారా నిరూపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ రికార్డ్స్ ను సంప్రదించారు. ఫిబ్రవరి 14వ తేదీన Unity sculpture in Kyiv దగ్గర ఇరువురిని గొలుసులతో కట్టేశారు.

ఛైన్ లతో కట్టేముందు…నేషన్ రికార్డ్స్ ఆఫ్ ప్రతినిధులు వారి మానిసక పరిస్థితి ఎలా ఉందో చెక్ చేశారు. వారి మెంటల్ హెల్త్ బాగానే ఉందని నిర్ధారించుకున్న తర్వాత..గొలుసు కట్టారు. అన్ని ఛైన్ లింక్ లను వెల్డింగ్ చేశారు. తొలి పరీక్షలో భాగంగా 325 మైళ్లపాటు ట్యాక్సీలో ప్రయాణించారు. ఆ ప్రయాణంలో కలిసే భోజనం, వాష్ రూమ్ కు కూడా కలిసే వెళ్లారు. వీరిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలిశాక..నవ్వుకున్నారు. మూడు నెలల వరకు ఇలా కలిసే ఉంటామని చెబుతున్నారు. విజయం సాధించి.. గొప్ప ప్రేమికులుగా రికార్డు సాధిస్తామని అలెగ్జాండర్, విక్టోరియా జంట పక్కాగా చెబుతోంది.