జో బైడెన్ ను కదిలించిన మహిళ లేఖ..స్వయంగా ఫోన్ చేసి తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్న అమెరికా ప్రెసిడెంట్

జో బైడెన్ ను కదిలించిన మహిళ లేఖ..స్వయంగా ఫోన్ చేసి తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్న అమెరికా ప్రెసిడెంట్

Joe Biden responds to a women letter : అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ను ఓ మహిళ రాసిన లేఖ కదిలించింది. గత నెలలోనే జో బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మిచెల్ వోల్కెర్ట్ అనే ఓ బాధిత మహిళ బైడెన్ కు లేఖ రాశారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో నేను ఉద్యోగం కోల్పోయానని నాలాగా ఎంతోమంది బాధితులు ఉద్యోగాలు కోల్పోయి దిక్కు తోచక అల్లాడుతున్నారని దయచేసి మాలాంటివారికి సహాయం చేయండి అంటూ లేఖ రాశారు మిచెల్ వోల్కెర్ట్ అనే మహిళ.

ఆ లేఖ చదివిన బైడెన్ చలించిపోయిరు. వెంటనే స్పందించారు. సదరు బాధిత మహిళలకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. మీతో పాటు మీలా ఉద్యోగాలు కోల్పోయినవారికి తప్పకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో మిచెల్ తన బాధలన్నీ తీరిపోయినట్లుగా సంతోషపడిపోయింది. ఏదో తమ గోడు వెళ్లబోసుకోవటానికి అధ్యక్షుడికి లేఖ రాశామని కానీ దాన్ని ఆయన చదివి స్వయంగా ఫోన్ చేయటం చాలా సంతోషంగా ఉందని ఆయన సహాయం చేస్తారనే భరోసానిచ్చారంటూ హర్షం వ్యక్తం చేసారు మిచెల్.

కాగా..కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ వోల్కెర్ట్ అనే మహిళ కరోనా సంక్షోభంతో తన ఉద్యోగం కోల్పోయింది. అలాని బాధపడుతూ కూర్చోలేదు. తనలాగా ఇంకా ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోయారని..అటువంటివారి బాధలు ఎలా ఉన్నాయి? వాళ్లు ఏంచేస్తున్నారో తెలుసుకోవాలనుకుంది. అలా తనలా ఉద్యోగం కోల్పోయిన అనేకమందిని కలుసుకుని వారి పరిస్థితులను తెలుసుకుంది. వాటన్నింటినీ లేఖలో రాస్తూ..మిచెల్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఓ లేఖ రాసారు. ఈ లేఖ పట్ల బైడెన్ వెంటనే స్పందించారు. లేఖ రాసిన మిచెల్ కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. క్షేమ సమాచారాలు అడిగారు. విషయం పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

అధ్యక్షుడు అడిగినవాటికి సమాధానంగా మిచెల్ గత జూలైలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని..అదేమంటే కరోనా సంక్షోభంతో జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవని తెలిపారని చెప్పారు. తాను పనిచేస్తున్న సంస్థలో తనతో పాటు అనేకమందిని తొలగించారని మిచెల్ చెప్పుకొచ్చారామె. ఇప్పుడు తాను కుటుంబ పోషణ కోసం మరో ఉద్యోగం చూసుకుంటున్నానని..కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితులు కూడా లేవనీ..దీంతో తనకు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడంలేదని వాపోయింది. ఆ మహిళ పరిస్థితితో పలు పలువురి దీనస్థితి గురించి మిచెల్ చెబుతుంటే ఆవేదనతో బైడెన్ కదిలిపోయారు.

ఉద్యోగం అనేది జీతం కోసం మాత్రమే కాదని..ఉద్యోగంతో గౌరవమర్యాదలు కూడా వస్తాయని, సమాజంలో ఓ వ్యక్తి స్థానం ఏమిటనేది ఉద్యోగమే చెబుతుందని తన తండ్రి చెప్పిన మాటలను బైడెన్ గుర్తు చేసుకుంటూ అదే మాటల్ని ఆ మహిళతో ఫోన్ లో మాట్లాడుతూ ప్రస్తావించారు. కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారందరినీ ఎమర్జెన్సీ రిలీఫ్ కింద ఆదుకుంటున్నామని హామీ ఇచ్చారు బైడెన్.

మిచెల్ తో మాట్లాడితన తరువాత బైడెన్ మీకు ఎంతమంది పిల్లలు అని అడుగారు. ఆ తరువాత మిచెల్ కుమార్తెతోనూ బైడెన్ ఫోన్ లో మాట్లాడారు. ఉద్యోగం పట్ల మీ మమ్మీ మిచెల్ కనబరుస్తున్న తపన తనను ఎంతగానో ఆకట్టుకుందని.. బైడెన్ చెప్పారు. మీ పరిస్థితులు తప్పకుండా బాగుంటాయని దానికి నేను హామీ ఇస్తున్నానని చెప్పటంతో మిచెల్ ఆనందంతో పొంగిపోయింది. అమెరికా అధ్యక్షుడు తనకు స్వయంగా ఫోన్ చేయడంతో మిచెల్ పొంగిపోతోంది. తన తండ్రి చెప్పిన మాటలను ఆయన తనతో పంచుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపించిందనీ..ఇది తన జీవితంలో మర్చిపోలేనని మిచెల్ సంతోషంగా చెప్పారు.