Marburg virus: మరో ప్రాణాంతక వైరస్.. ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి

కరోనా కష్టాలే కాదు.. కనుమరుగైపోయిందనుకుంటున్న మరో వైరస్ తిరగబడింది. మార్‌బర్గ్‌ వ్యాధి మళ్లీ వెలుగుచూసి ప్రాణాలను బలిగొంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

Marburg virus: మరో ప్రాణాంతక వైరస్.. ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి

Marburg Virus

Marburg virus: కరోనా కష్టాలే కాదు.. కనుమరుగైపోయిందనుకుంటున్న మరో వైరస్ తిరగబడింది. మార్‌బర్గ్‌ వ్యాధి మళ్లీ వెలుగుచూసి ప్రాణాలను బలిగొంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో ఆగష్టు 2న చనిపోయిన వ్యక్తిలో వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) వెల్లడించింది.

ఎబోలాను కలుగజేసే వైరస్‌ జాతికి చెందిన ఫిలోవిరిడే వైరస్‌ ద్వారా మార్‌బర్గ్ వైరస్ సోకుతుంది. 1967లో జర్మనీలోని మార్‌బర్గ్‌ సిటీలో దీనిని తొలిసారిగా గుర్తించి దీనికి అదే పేరును పెట్టేశారు. వ్యాధి సోకిన వారిలో 88 శాతం మంది మరణించే ప్రమాదమున్నదని.. గుహలు, అడవుల్లో తిరిగే రౌసెట్టూస్‌ అనే గబ్బిలాల ద్వారా వైరస్ సోకుతుంది.

వ్యాధి సోకిన రోగుల రక్తాన్ని, లాలాజలాన్ని, స్రవాలను తాకడం వల్లనే దీని వ్యాప్తి జరుగుతుంది.

తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, శరీర భాగాలు తిమ్మిరిగా ఉండటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇంకా ఈ వ్యాధి కట్టడికి ఎటువంటి వ్యాక్సిన్లు, మెడిసిన్ అందుబాటులో లేదు. రోగి శరీరంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించేందుకు పండ్లరసాలు, ఎలక్ట్రోలైట్‌ ద్రవాలను ఇస్తూ కాపాడుకోవాలి.