World Heart Day : మారుతున్న జీవన శైలి..పెరుగుతున్న గుండెపోటు

గుండె జబ్బులను సకాలంలో గుర్తించాల్సిన అవసరం ఉందనే అంశంపై అవగాహన పెంచడానికి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 29న ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ జరుపుతున్నారు. అదే ఈరోజు..వరల్డ్ హార్ట్ డే.

World Heart Day : మారుతున్న జీవన శైలి..పెరుగుతున్న గుండెపోటు

World Heart Day

World Heart Day 2021 :సెప్టెంబర్ 29.‘వరల్డ్‌ హార్ట్‌ డే’. గుండె జబ్బులను సకాలంలో గుర్తించాల్సిన అవసరం ఉందనే అంశంపై అవగాహన పెంచడానికి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 29న ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటులో ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కారణమేంటీ? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? గుండెపోటు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి అలవాట్లు మార్చుకోవాలి? అనే అంశాల గురించి తెలుసుకుందాం.

ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవితం. తద్వారా పెరుగుతున్న మానసిక ఒత్తిడి. మారుతున్న ఆహారపు అలవాట్లు,యాంత్రిక జీవనం, శారీరక వ్యాయామం లేకపోవటం. వెరసి హార్ట్ ఎటాక్ లు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సమయానికి భోజనం చేయకపోవటం. నిద్రలేమి. బీపీ,షుగర్‌ వ్యాధితో పాటు శరీర బరువుపై అదుపుకోల్పోవడం, వైద్య పరీక్షలకు నిర్లక్ష్యం చేయడం ఇలా గుండె సమస్యలకు అనేక కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటికి తోడు పెరుగుతున్న మధుమేహం కూడా ప్రమాదంగా మారుతోంది. అధిక రక్తపోటు, ఊబకాయ సమస్యలూ గుండెపోటులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Read more : Organ Donation: మరణం తర్వాత కూడా జీవించే గొప్పదానం..8మందికి కొత్త జీవితమిచ్చే మహద్భాగ్యం

కాగా గతంలోకంటే గత రెండేళ్లుగా గుండెపోటు మరణాలు పెరిగాయి. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల ఇవి మరింత పెరిగాయి. కరోనా టెన్షన్ ..సోకినవారికి మానసిక ఆందోళన, కరోనా సోకినవారిలో వస్తున్న అనారోగ్య సమస్యలు గుండెపోటులకు కారణమవుతునట్లుగా తెలుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయనే విషయం చేదునిజంగా నమ్మాల్సిందే.

జిల్లాలో 35శాతం బాధితులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారనీ..వీరిలో పురుషుల 22శాతం, మహిళలు 13 శాతం ఉన్నారని నిపుణులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం, పట్టణాల్లో వీరి 56శాతం ఉంటుందని వైద్యాధికారులు వెల్లడించారు. హఠాత్తుగా ఏదైనా సమస్య ఎదురైతే గుండెపోటుకు గురి అయ్యేవారు 10శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారని తెలిపారు.

వృద్ధులే కాదు యువకులకు కూడా హార్ట్ ఎటాక్..
గతంలో గుండెపోటు 50 ఏళ్లు దాటిన వారిలో వచ్చేది.కానీ ఇప్పుడా వయస్సు తగ్గిపోయి ఆందోళన కలిగిస్తోంది. చాలా చిన్నవయస్సువారే గుండెపోటుకు గురవుతున్నారని తెలుస్తోంది. 20ఏళ్ల వయసు యువకులకు కూడా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు.అలాగే 20 ఏళ్లనుంచి 70ఏళ్ల వారి వరకు గుండెపోటులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని కారణం మానసిక ఒత్తిడి,మద్యపానం, ధూమపానంతో పాటు అతి చిన్న వయస్సులో మధుమేహ వ్యాధికి గురికావటం వంటివి. అలాగే పెరుగుతున్న బీపీ, పెరుగుతున్న ఫాస్ట్‌ఫుడ్ కల్చర్, అధిక బరువు పెరగటం, శరీరంలో పేరుకుపోతున్న చెడు కొలాస్ట్రాల్‌ గుండెపోటులకు కారణాలుగా ఉన్నాయి.

Read more : Constable Heart donation : కానిస్టేబుల్ గుండె దానం..పంజాగుట్ట నిమ్స్ లో పెయింటర్ హార్ట్ సర్జరీ

కోవిడ్ వల్ల పెరిగిన గుండెపోట్లు..50 నుంచి 60శాతం..
ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా మహమ్మారి గుండెపోటులు పెరగటానికి మరో కారణంగా మారుతోంది. కోవిడ్‌ వల్ల 50నుంచి 60శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన 7నుంచి 10రోజుల మధ్య సమయంలో ఈ సమస్య బాగా ఉంటోంది.గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, మద్యం, సిగరెట్‌ వల్ల సమస్య ఉండేది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు.అలాగే..ఆయాసం ఎక్కువగా ఉన్నా..గుండె నొప్పిగా ఉన్నా..వెంటనే కార్డియాలజిస్ట్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.వారి సూచనల మేరకు అవసరమైతే మెడిసిన్స్ వాడాలి.అలాగే వారు చెప్పిన సూచనల్ని పాటించారు. సరైన చికిత్స తీసుకోవాలి.

Read more : World Organ Donation Day : అవయవ దానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే

వ్యాయామం లేకపోవడం..
కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం కావటం..వ్యాయామం లేకపోవటం ఫలితంగా పెరుగుతున్న ఊబకాయంతో చిన్ననాటినుంచే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఉద్యోగులు గంటల తరబడి కదలకుండా కూర్చుని పనులు చేయటం తరువాత అలసిపోవటంతో ఎలాంటి వ్యాయామం లేకుండా నిద్రపోవడం. దీంతో శరీరంలో కొవ్వు పెరిగి రక్తంలో బ్లాక్స్‌ ఏర్పాటు అవుతాయి. దీంతో గుండె, మెదడు స్ట్రోక్‌ వస్తోంది. రోజు 45నిమిషాల పాటు వ్యాయామం చేసి, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోకుంటే మంచిది. మాంసం వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.