World Pangolin Day : ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం..అంతరించిపోతున్న ‘అలుగు’లను బతకనిద్దాం..

ఈరోజు ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం..అంతరించిపోతున్న మూగజీవి ‘అలుగు’లను బతకనిద్దాం..

World Pangolin Day : ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం..అంతరించిపోతున్న ‘అలుగు’లను బతకనిద్దాం..

World Pangolin Day

World Pangolin Day : పాంగోలిన్. అమాయకంగా కనిపించే మూగజీవి. చిన్న చిన్న పురుగుల్ని, చీమల్ని, చెద పురుగుల్ని తిని జీవిస్తుంది. పాంగోలిన్ ను తెలుగులో ‘అలుగు’అంటారు. ఈ అలుగును అక్రమంగా రవాణా చేస్తుంటారు. అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో ఉన్న అలుగుల రక్షణ కోసం ఓ ప్రత్యేక రోజు ఏర్పాటు చేశారు. అదే ఫిబ్రవరి మూడవ శనివారం. ‘ప్రపంచ పాంగోలిన్ దినోత్సం’అంటే ప్రపంచ అలుగు దినోత్సవం. ఈ దినోత్సవాన్ని ఫిబ్రవరి 3వ శనివారం రోజున జరుపుకుంటారు. ఈ అంతర్జాతీయ దినోత్సవం పాంగోలిన్ జాతుల గురించి అవగాహన పెంచుతుంది. అలుగుల పరిరక్షణ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి వివిధ వాటాదారులను సమీకరిస్తుంది. 9 వ ప్రపంచ పాంగోలిన్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 15, 2020 న జరుపుకున్నారు.

Also read : World Elephant Day: ప్రపంచ ఏనుగుల దినోత్సవం..జీవ వైవిధ్యంలో గజరాజులు

అత్యంత ప్రమాదంలో ఉన్న జాతులలో చేర్చబడిన భారతీయ పాంగోలిన్ (మానిస్ క్రాసికాడటా) ను పరిరక్షించడానికి మధ్యప్రదేశ్ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారతీయ పాంగోలిన్ యొక్క జీవావరణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి మరియు సమర్థవంతంగా పరిరక్షించడానికి మధ్యప్రదేశ్ అటవీ శాఖ మరియు వన్యప్రాణుల పరిరక్షణ ట్రస్ట్ (డబ్ల్యుసిటి) సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టులో, కొన్ని పాంగోలిన్ల యొక్క రేడియో – ట్యాగింగ్ చేయడం ద్వారా వాటి కార్యకలాపాలు, వసతి, నిత్యకృత్యాలను అధ్యయనం చేయడం జరుగుతోంది.

మూగజీవి అలుగులను అక్రమార్కులు అక్రమంగా అమ్మేస్తున్నారు. భారీ ధర పలకటంతో వీటి అక్రమ రవాణాలు పెరుగుతున్నాయి. ఒక్క అలుగుని రూ.కోటిన్నరకు అమ్ముతున్నారంటే..దాని డిమాండ్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అసలు అలుగుకు ఇంత భారీ ధర ఎందుకు పలుకుతోందది?ఎందుకు అంత రేటు పెట్టి కొంటున్నారు? తెలుసుకుందాం.

Also read : World Rhino Day 2021 : ఖడ్గమృగాల గురించి ఆసక్తికర విషయాలు

అలుగు (Pangolin) చీమలు, చెద పురుగులు తింటూ తన దారిన తాను బతికే ఓ మూగ జీవి. మనుషుల జోలికి అస్సలు రాదు. ఎప్పుడైనా మనుషులు, శత్రువులూ తన దగ్గరకు వస్తే భయంతో బంతిలా ముడుచుకుపోతుంది. అలా ముడుచుకుపోయనప్పుడు దాని ఒళ్లంతా ఉండే చిప్పలు దానికి రక్షణ కవడంలా మారతాయి. దాని శరీరమే దానికి రక్షణ. అంతకు మించి మరి ఏ రక్షణాల లేని మూగ జీవి అలుగు. కానీ మనిషి తన స్వార్తం కోసం డబ్బుకోసం అలుగుల అంతం చూస్తున్నాడు. అడవులు పెరిగిన చోటే అలుగులు ఉంటాయి.

అందుకే అలుగులకు అంత డిమాండ్..
అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో అలుగులు కూడా ఉన్నాయి. అందుకే వీటి రక్షణ కోసం ఫిబ్రవరి మూడవ శనివారం (World Pangolin Day) జరుపుతున్నారు. ప్రపంచంలో మనుషుల అక్రమ రవాణా తర్వాత అత్యంత ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్నది ఈ మూగజీవులే. రకరకాల వ్యాధుల్ని నయం చేసే లక్షణాలు వీటికి ఉన్నాయనే బూటకపు ప్రచారం చేస్తూ వేటగాళ్లు వీటిని అమ్ముకుంటున్నారు.

Also read : International sign day : ప్రపంచ సంజ్ఞ దినోత్సవం..వారికోసమే ఈ రోజు

ఎంతో సిగ్గు, మొహమాటం, భయం కలిగివుండే పాంగోలిన్స్ (అలుగు)… తమ దగ్గరకు మనుషులు వస్తే… వేగంగా పారిపోలేక… బంతిలా గుండ్రంగా చుట్టుకుంటాయి.అలా చుట్టుకోగానే వాటిని చక్కగా పట్టుకుని సంచిలో వేసి పట్టుకుపోతున్నారు వేటగాళ్లు. ఫలితంగా ఈ మూగజీవి జంతువుల సంఖ్య బాగా తగ్గిపోయింది.

ఆసియా, ఆఫ్రికాలో కనిపించే పాంగోలిన్స్‌ని ఎక్కువగా చంపేస్తున్నది చైనా లోనే. వీటి మాంసాన్ని మార్కెట్లలో అక్రమంగా అమ్మడమే కాదు వీటి బాడీపై ఉండే అచ్చులను (పెంకులు) చైనా సంప్రదాయ ఔషధాల (మందులు) తయారీలో వాడుతున్నారు. అంతేకాదు కొంతమంది వీటి శరీరంతో జాకెట్స్ కుట్టించుకుంటారు. పాంగోలిన్స్‌ని అమ్మడం, కొనడం ప్రపంచవ్యాప్తంగా నిషేధం. చైనాలో కరోనా వైరస్ వ్యాపించిన వుహాన్ సీ-ఫుడ్ మార్కెట్‌లో రకరకాల అరుదైన, అంతరించిపోయే జీవుల్ని అమ్ముతుంటారు. వాటిలో పాంగోలిన్స్ కూడా ఉన్నాయి.

Also readWorld Highest Chenab bridge : మేఘాలపై..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి లేటెస్ట్ ఫోటోలు

నిజానికి ఇలాంటి జీవులు ఉండటం వల్లే మన పర్యావరణంలో మనం ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. ఈ జీవరాసి, ప్రాణులు లేకపోతే… మానవుల మనుగడ కూడా ఉండదు. అందరం ఈ ప్రకృతిలో భాగమే కాబట్టి… ప్రకృతి ఎంత నాశనమైతే… అంతలా మనమూ దెబ్బతింటాం. ఇప్పటికే చాలా రకాల జీవులు, జంతువులు, పక్షులు, వృక్షాలు అంతరించిపోయాయి. మీకు ఎప్పుడైనా ఊళ్లో అలుగు కనిపిస్తే… దాన్ని పోలీసులకు లేదా అటవీ అధికారులకు అప్పగించడం మేలు.ప్రతి మనిషికీ జీవించే హక్కు ఎలా ఉందో ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ జీవికి, ప్రతీ ప్రాణికి జీవించే హక్కు ఉందనే సంగతి మనిషి గుర్తించాలి. ఏ జీవి మానానా దాన్ని జీవించేలా చేయాలి. అప్పుడే మనిషి మనుగడ కూడా ప్రశాంతంగా సాగుతుంది.