Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ తర్వాత గ్రేటర్‌లో మరో ఉపఎన్నిక ఖాయమా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి?

ఒకవేళ స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ తర్వాత గ్రేటర్‌లో మరో ఉపఎన్నిక ఖాయమా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి?

Updated On : October 21, 2025 / 7:52 PM IST

Jubilee Hills Bypoll: ఆయనో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరి హస్తం పార్టీ సింబల్ మీద ఎంపీగా కంటెస్ట్ చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేపై వేటు వేయాలని బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తోంది. ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ చెప్తూ వస్తుంటే..అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకో స్టెప్ ముందుకేసింది. జూబ్లీహిల్స్ బైపోల్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాను నేరుగా ఎన్నికల సంఘానికే ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ తర్వాత మరో బైపోల్‌ ఖాయమా అనే చర్చ మొదలైంది.? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి.? కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా మారిన ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు..?

తెలంగాణ పాలిటిక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయ్. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైమ్ ఉండగానే..రేపే ఎలక్షన్ ఉందన్నట్లుగా..నెక్ టు నెక్ ఫైట్‌కు దిగుతున్నాయి అధికార, ప్రతిపక్షం. సరిగ్గా ఇదే టైమ్‌లో జూబ్లీహిల్స్ బైఎలక్షన్ వచ్చింది. ఈ ఉపఎన్నిక కంటే ముందే.. ఏడాదిన్నరగా..ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ తెలంగాణ గట్టు మీద రాజకీయాన్ని రంజుగా మార్చింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరును చేర్చడంతో కొత్త చర్చ తెరమీదకు వస్తుంది.

ఇప్పటికే దానంను అనర్హత వేటు వెంటాడుతోంది. సుప్రీం డైరెక్షన్స్‌ ప్రకారం ఈ నెల 31లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆ పార్టీ సింబల్ మీద ఎంపీగా కంటెస్ట్ చేశారని..దానంపై వేటు ఖాయమని జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో 34వ పేరుగా దానం నేమ్‌ను ఎన్నికల అధికారికి పంపించింది కాంగ్రెస్. దీంతో బీఆర్ఎస్‌కు మరో అస్త్రం దొరికినట్లు అయింది.

అందుకే అక్కడ దానంను స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది..!

అయితే దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఖరారు చేయడం వెనుక హస్తం పార్టీ వ్యూహం ఉందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో మున్నూరు కాపు సామాజికవర్గం ఓటర్లు అధికం. ఈ నియోజకవర్గంలో దానం నాగేందర్‌కు అనుచరగణం కూడా ఉంది. అందుకే అక్కడ దానంను స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించిందట కాంగ్రెస్ అధిష్టానం. అయితే దానంపై వేటు పడటం ఖాయమని.. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక తప్పదని కాంగ్రెస్ పార్టీ కూడా డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 31లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ లోపే దానం నాగేందర్‌తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్హరత వేటు పడేకంటే ముందే దానంతో రిజైన్ చేయించడమే మంచిదన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోందట. దీంతో జూబ్లీహిల్స్ తర్వాత ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక రావడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ కంటే ముందే దానం రిజైన్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన జూబ్లీహిల్స్ టికెట్ అడిగారని..ఖైరతాబాద్‌లో కూడా గెలిపిస్తానని హామీ ఇచ్చారని టాక్ నడిచింది. కానీ దానం ప్రపోజల్‌కు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునే టైమ్ దగ్గరలోనే ఉంది. ఈ సిచ్యువేషన్‌లో దానం నాగేందర్ రిజైన్ చేయడమో లేక అనర్హతకు గురవడమో ఏదో ఒకటి ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఈ రెండింటిలో ఏది జరిగినా ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక రావడం మాత్రం పక్కా.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు?

ముందు నుంచి దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడుతుందని బలంగా నమ్ముతూ వస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్‌ లిస్ట్‌లో ఆయన పేరుండటంతో కారు పార్టీ దానంపై వేటు ఖాయమని మరింత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు. అందుకే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు తొలి దెబ్బ, ఆ తర్వాత ఖైరతాబాద్‌లో రెండో దెబ్బ కొడతామని కేటీఆర్ అంటున్నారట. అంతేకాదు రెండేళ్లలో బీఆర్ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని కూడా కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం మీద GHMC ఎన్నికలకు ముందు గ్రేటర్‌లో వరుసగా రెండు బైపోల్స్‌లో గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ కసి మీదున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ పలు సర్వేలు అంచనా వేస్తుండటంతో కారు పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఖైరతాబాద్ బైపోల్ వస్తే ఇదే ఊపుతో గెలిచి తీరుతామని లెక్కలు వేసుకుంటోందట గులాబీ దళం. మరి దానం రిజైన్ చేస్తారా.? లేక స్పీకర్ వేటు వేస్తారా.? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు వెయిట్ చేస్తారా.? అసలేం జరగబోతుందనేది ఈ నెలాఖరులో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.