World Corona Report : ఒక్కరోజే 17.62 లక్షల కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి కరోనా వేరియంట్ జత కలవడంతో కేసులు పరుగులు పెడుతున్నాయి.

World Corona Report : ఒక్కరోజే 17.62 లక్షల కరోనా కేసులు

World Corona Report

World Corona Report : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి కరోనా వేరియంట్ జత కలవడంతో కేసులు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 17.62 లక్షల కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 10 లక్షల కేసులు ఒక్క అమెరికాలోనే వెలుగుచూశాయి. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ 19 స్థితిపై మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశంలో 2,14,000 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత వారంలో సగటున చూస్తే రోజుకు 29,925 కేసులు నమోదయ్యాయి.

చదవండి : AP Corona : ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

గతేడాది డిసెంబర్ 29న దేశంలో 0.79 శాతంగా ఉన్న కేసుల పాజిటివ్ కేసు ఇప్పుడు 5.03 శాతానికి పెరిగిందని తెలిపారు అగర్వాల్. కేసుల్లో 6 రెట్లు పెరుగుదల, సానుకూలత రేటులో 6 రెట్లు పెరుగుదల కూడా నమోదైందని తెలిపారు. మహారాష్ట్రలో వారం నుంచి వారం ప్రాతిపదికన యాక్టివ్ కేసుల సంఖ్య 4 రెట్లు పెరిగిందని లవ్ అగర్వాల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా యాక్టివ్ కేసుల సంఖ్య 3.4 రెట్లు పెరిగిందని ఇక ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 9 రెట్లు పెరిగిందని వివరించారు

చదవండి : Covid Vaccine: పన్నెండోసారి కోవిడ్ వ్యాక్సిన్ డోస్ తీసుకుంటూ దొరికిపోయిన ప్ర’వృ’ద్ధుడు

ఇక ఇదిలా ఉంటే బుధవారం ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10, 665 కొత్త కేసులు నమోదు కాగా 8మంది మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

చదవండి : JJ Hospital : జేజే ఆసుపత్రిలో 61 మంది వైద్యులకు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

 

ఇక కర్ణాటకలో 4,246 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందినట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ తేలింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది.