Tenth Exam Results : పదో తరగతి పరీక్షలు రాసిన తండ్రీకొడుకులు.. తండ్రి పాస్, కొడుకు ఫెయిల్

టెన్త్ పరీక్షల ఫలితాలు చూసిన ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే తండ్రి పరీక్షల్లో పాస్ కాగా.. కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు.(Tenth Exam Results)

Tenth Exam Results : పదో తరగతి పరీక్షలు రాసిన తండ్రీకొడుకులు.. తండ్రి పాస్, కొడుకు ఫెయిల్

Tenth Exams

Tenth Exam Results : చదువుకి వయసుకి సంబంధం లేదంటారు. చదువుకోవాలనే ఆసక్తి ఉండాలి కానీ ఏజ్ తో పనేముంది. అనేక సందర్భాల్లో ఇది ప్రూవ్ అయ్యింది. పెద్ద వయసున్న వారు కూడా పిల్లలతో కలిసి పరీక్షలు రాయడం చాలాసార్లు చూసే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కొడుకుతో కలిసి టెన్త్ పరీక్షలు రాశాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. పరీక్షల్లో తండ్రి పాస్ అయ్యాడు. కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మహారాష్ట్రంలోని పుణెకు చెందిన భాస్కర్‌ వాగ్‌మారే (43) తన కొడుకుతో కలిసి ఇటీవల టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. ఆ రిజల్ట్స్ శుక్రవారం వచ్చాయి. ఫలితాలు చూసిన కుటుంబ సభ్యులకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే తండ్రి భాస్కర్‌ పరీక్షల్లో పాస్ కాగా.. కొడుకు మాత్రం తప్పాడు. ఏడో తరగతి తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడడంతో భాస్కర్‌ చదువు మానేశాడు. 30 ఏళ్ల తర్వాత తిరిగి తన కొడుకుతో కలిసి ఈ ఏడాది పది పరీక్షలకు హాజరయ్యాడు. పదో తరగతి పరీక్షల్లో భాస్కర్ పాస్ అవగా, అతని కుమారుడు ఫెయిల్ అవడంతో ఆ కుటుంబ పరిస్థితి విచిత్రంగా మారింది.(Tenth Exam Results)

భాస్కర్ కు చదువు అంటే ఆసక్తి. కానీ కుటుంబ పరిస్థితులు, ఆర్థికి స్థితిగతుల సరిగా లేక సెవెన్త్ క్లాస్ వరకు చదువుకుని ఆపేశాడు. తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడటంతో పూర్తిగా చదువుకి దూరమయ్యాడు. అయితే మళ్లీ చదువుకుని పదో తరగతి పాస్ కావాలని భాస్కర్ నిర్ణయించుకున్నాడు. తన కుమారుడు కూడా ఇదే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తుండటం అతనికి కలిసొచ్చింది. కొడుకుతో కలిసి నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యేవాడు. అలా ఎంతో కష్టపడి పది పరీక్షలు రాసి పాసయ్యాడు.

Viral Video: విద్యార్థినిలతో కలిసి స్టెప్పులు వేసిన యంగ్ టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

‘పెద్ద చదువులు చదువుకోవాలని నాకు ముందు నుంచీ ఉండేది. కానీ, కుటుంబ బాధ్యతల వల్ల కుదరలేదు. కొంతకాలం నుంచి తిరిగి చదువుకోవాలని అనిపించింది. కొన్ని కోర్సులు చేయడం వల్ల మరింత సంపాదించొచ్చనే ఆలోచన కలిగింది. అందుకే పదో తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నా. నా కొడుకు కూడా ఈ ఏడాదే పరీక్షలు రాశాడు. నేను పాస్‌ అయినందుకు సంతోషంగానే ఉన్నప్పటికీ.. కొడుకు ఫెయిల్‌ కావడం మాత్రం బాధిస్తోంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ రాసి పాసయ్యేలా కొడుక్కి సహకారం అందిస్తా. ఈసారి తప్పకుండా నా కుమారుడు పాస్‌ అవుతాడు’ అని తండ్రి భాస్కర్ నమ్మకంగా చెప్పాడు.

Viral Video: లక్షలాది కప్ప పిల్లల సైన్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో

కాగా, చదువుకి వయసుతో సంబంధం లేదని భాస్కర్ మరోసారి నిరూపించాడు. చదువుకోవాలనే ఆసక్తి, పట్టుదల ఉండాలే కానీ.. ఏజ్ తో పనేముందని ఆయన అంటున్నారు. లేట్ వయసులో ఎంతో పట్టుదలతో కష్టపడి చదువుకుని టెన్త్ పరీక్షల్లో పాస్ అయిన భాస్కర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.