Diamond : 15 ఏళ్ల అన్వేషణ.. 8.22 క్యారెట్ల వ‌జ్రం లభ్యం

వజ్రాల కోసం 15 ఏళ్లుగా అన్వేషిస్తున్న వారికి ఫలితం దక్కింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వజ్రాల వేట కొన‌సాగిస్తున్న న‌లుగురు కార్మికుల‌కు 8.22 క్యారెట్ల వ‌జ్రం ల‌భ్య‌మైంది.

Diamond : 15 ఏళ్ల అన్వేషణ.. 8.22 క్యారెట్ల వ‌జ్రం లభ్యం

Diamond

diamond found in madhya pradesh : వజ్రాలు ఎంత విలువైనవో మనందరికీ తెలుసు. 1, 2 క్యారెట్లంటేనే వాటి ధర లక్షల రూపాయల్లో ఉంటుంది. అలాంటిది మధ్యప్రదేశ్ లో ఏకంగా 8.22 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. ఈ వజ్రం ప‌న్నా జిల్లాలో నలుగురు కార్మికులకు దొరికింది.

వజ్రాల కోసం 15 ఏళ్లుగా అన్వేషిస్తున్న వారికి ఫలితం దక్కింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వజ్రాల వేట కొన‌సాగిస్తున్న న‌లుగురు కార్మికుల‌కు 8.22 క్యారెట్ల వ‌జ్రం ల‌భ్య‌మైంది. దాని విలువ మార్కెట్‌లో సుమారు 40 ల‌క్ష‌ల రూపాయలు ఉంటుంది. న‌లుగురు కార్మికులు వ‌జ్రాల కోసం సుమారు 15 ఏళ్ల నుంచి అన్వేషిస్తున్నారు.

The Sakura Pink Diamond: రూ.213 కోట్ల డైమండ్.. వేలంలో దక్కించుకున్న వ్యాపారి!

ప‌న్నా జిల్లాలోని హిరాపూర్ త‌ప‌రియాన్‌లో ఉన్న లీజు భూమిలో ర‌త‌న్‌లాల్ ప్ర‌జాప‌తితో పాటు ఇత‌రుల‌కు ఆ వజ్రం దొరికిన‌ట్లు క‌లెక్ట‌ర్ సంజ‌య్ కుమార్ మిశ్రా వెల్లడించారు. వ‌జ్రాన్ని వేలం వేసిన త‌ర్వాత వ‌చ్చే సొమ్మును ఆ న‌లుగురికి సమానంగా పంచి ఇవ్వ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 21వ తేదీ నుంచి వ‌జ్రాల‌ను వేలం వేయ‌నున్నారు.

వ‌జ్రం అమ్మితే వ‌చ్చే డ‌బ్బుతో పిల్ల‌ల‌కు మంచి చ‌దువు చెప్పించ‌నున్న‌ట్లు ర‌ఘువీర్ ప్ర‌జాప‌తి పేర్కొన్నారు. భోపాల్‌కు 380 కి.మీ దూరంలో ఉన్న ప‌న్నా జిల్లాలో సుమారు 12 ల‌క్ష‌ల క్యారెట్ల వ‌జ్రాలు ఉండి ఉంటాయ‌ని భావిస్తున్నారు.

Ramana Deekshitulu: మరోసారి తెరపైకి పింక్‌ డైమండ్.. ఎలా పగిలింది?

ఈ ఏడాది జనవరి నెలలో ఆఫ్రికాలోని బోత్సవానాలో ఏకంగా 378 క్యారెట్ల డైమండ్ లభ్యమైంది. కెనాడాకు చెందిన లుకారా డైమండ్స్​కు చెందిన గనిలో ఈ అరుదైన వజ్రం దొరికింది. ఈ వజ్రం అద్భుతంగా ఉందని ఆ సంస్థ వెల్లడించింది.