BJP Executive Meeting : హైదరాబాద్‌లో కాషాయ సంబురం.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం

BJP Executive Meeting : హైదరాబాద్‌లో కాషాయ సంబురం.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం

Bjp Executive Meeting

BJP Executive Meeting : హైదరాబాద్ లో కాషాయ సంబురం నెలకొంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, వందల సంఖ్యలో బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ తరలివస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ నేతలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఎయిర్ పోర్టు నుండి శంషాబాద్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. హెచ్ఐసీసీలో ఫొటో ఎగ్జిబిషన్ ను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. సాయంత్రం అన్ని రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్న నడ్డా.. వారికి దిశానిర్ధేశం చేయనున్నారు. రేపు(జూలై 2), ఎల్లుండి(జూలై 3) హెచ్ఐసీసీ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనునున్నాయి. ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనాయకులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే మోదీ బహిరంగ సభపై బీజేపీ ఫోకస్ చేసింది. మోదీ సభకు 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని మోదీ సభ కోసం మొత్తం 16 ట్రైన్లను బుక్ చేసింది బీజేపీ.

బూత్ స్థాయి నుంచి పబ్లిక్ ను తరలించేలా ప్లాన్ చేస్తున్నారు నేతలు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మందిని సభకు తరలించాలని నియోజకవర్గ కో-ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది పార్టీ. జూలై 3న జరిగే మోదీ సభపైనే బీజేపీ ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ సభతో రాష్ట్రంలో సత్తా చాటుతామని బీజేపీ నేతలు అంటున్నారు. కేసీఆర్ నియంత పాలనను ప్రజలు సాగనంపుతారని చెప్పారు. 8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమయంగా మారిందని విమర్శలు గుప్పించారు.

Traffic restrictions: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లో అంటే..

హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం.. బీజేపీలో మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాలపైనా తన ముద్రవేయబోతోంది. జులై 2-3 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం భాగ్యనగరానికి తరలిరానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలతో పాటు ముఖ్యమైన నియామకాలు కూడా చేపట్టనున్నారు. కొవిడ్ తర్వాత జరుగుతున్న తొలి పూర్తి స్థాయి కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న కమలదళం.. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పార్టీ విస్తరణకు మార్గం నిర్మించనుంది.

Strong Security: భద్రతా వలయంలో మోదీ పర్యటించే ఏరియాలు.. మెట్రో సేవలు బంద్..

ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్లమెంటరీ చైర్‌పర్సన్ హోదాలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో సభ్యుడిగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కీలక నాయకత్వం వ్యవహరిస్తారు. వీరితో పాటు పార్టీలో కీలకనేత అయిన హోంమంత్రి అమిత్ షా, అదే విధంగా 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇందులో సభ్యులుగా ఉన్న 80 మంది ఆఫీసు బేరర్లు హాజరవుతారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి హాజరయ్యే ఈ సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.