Shivanna- Balayya : శివన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య.. శివన్న-బాలయ్య కాంబోలో సినిమా??

శివరాజ్ కుమార్ వేద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఎప్పట్నుంచో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే శివన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య హాజరు కానున్నారు. అయితే టాలీవుడ్ లో..........

Shivanna- Balayya : శివన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య.. శివన్న-బాలయ్య కాంబోలో సినిమా??

Shivanna- Balayya : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న 125వ సినిమా వేద. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది. 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని భారీగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవ్వనుంది. దీంతో తెలుగులో వేద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 7న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా జరగనుంది.

అయితే శివరాజ్ కుమార్ వేద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఎప్పట్నుంచో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే శివన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య హాజరు కానున్నారు. అయితే టాలీవుడ్ లో ఇప్పుడు ఇంకో గాసిప్ వినిపిస్తుంది. శివన్న-బాలయ్య కాంబోలో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Dhanush Vaathi : ధనుష్ ‘వాతి’ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ @ చెన్నై..

శివరాజ్ కుమార్ గతంలో బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇటీవల ఒక స్టార్ హీరో ఇంకో స్టార్ హీరోతో కలిసి సినిమాలు లేదా గెస్ట్ అప్పీరెన్స్ లు చేస్తున్నారు. దీంతో సినిమా మార్కెట్ వ్యాల్యూ కూడా పెరుగుతుంది. ఇటీవలే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ గా నటించారు. ఇక శివరాజ్ కుమార్ కూడా అటు రజినీకాంత్ జైలర్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాము స్టార్ హీరోలని చూడకుండా వేరే ఇండస్ట్రీ హీరోల సినిమాల్లో కూడా చేయడానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు. దీంతో కచ్చితంగా శివరాజ్ కుమార్, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చు అనే భావిస్తున్నారు. ఇదే జరిగితే టాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో మరో భారీ సినిమా అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.