BAN vs SL 2022 : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక జట్టు ఇదే..!

BAN vs SL 2022 : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక జట్టును ప్రకటించింది లంక క్రికెట్ బోర్డు. లంక జట్టులోని 18 సభ్యుల పేర్లును కూడా లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.

BAN vs SL 2022 : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక జట్టు ఇదే..!

Ban Vs Sl 2022 Sri Lanka Name 18 Man Squad For Bangladesh Test Series

BAN vs SL 2022 : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక జట్టును ప్రకటించింది లంక క్రికెట్ బోర్డు. లంక జట్టులోని 18 సభ్యుల పేర్లును కూడా లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా శ్రీలంక రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. దిముత్‌ కరుణరత్నే సారథ్యంలోని శ్రీలంక జట్టు మే 8న బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది.

మే 11న ప్రాక్టీసు మ్యాచ్‌ జరుగనుంది. ఈ సిరీస్‌తో ఒషాడా ఫెర్నాండో తిరిగి లంక జట్టులోకి రానున్నాడు. దేశవాళీ టోర్నీ నేషనల్‌ సూపర్‌ లీగ్‌లో ఫిట్‌నెస్ సాధించడంతో సెలక్టర్లు ఫెర్నాండోకు అవకాశం ఇచ్చారు. దాంతో బంగ్లాదేశ్ పర్యటనలో లంక జట్టులో ఫెర్నాండో కలవనున్నాడు.

బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య సిరీస్ షెడ్యూల్ ఎలా ఉందంటే.. మే 11, మే 12 తేదీల్లో ప్రాక్టీసు మ్యాచ్ ఛట్టోగ్రామ్ వేదికగా జరుగనుంది. మే 15 నుంచి మే 19 వరకు మొదటి టెస్టు అదే వేదికగా జరుగనుంది. అలాగే మే 23 నుంచి మే 27 వరకు రెండో టెస్టు ఢాకాలో జరుగనుంది.

Ban Vs Sl 2022 Sri Lanka Name 18 Man Squad For Bangladesh Test Series (1)

Ban Vs Sl 2022 Sri Lanka Name 18 Man Squad For Bangladesh Test Series

శ్రీలంక జట్టు ఇదే.. :
దిముత్‌ కరుణరత్నె(కెప్టెన్‌), కమిల్‌ మిషారా, కుశాల్‌ మెండిస్‌, ధనుంజయ డి సిల్వా, ఒషాడో ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్‌, కమిందు మెండిస్‌, నిరోషన్‌ డిక్‌విల్లా, దినేశ్‌ చండిమాల్‌, సుమిందా లఖణ్‌, కసున్‌ రజిత, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్‌ జయవిక్రమ, లసిత్‌ ఎంబుల్డనియా, రమేశ్‌ మెండిస్‌, చమిక కరుణరత్న, అసిత ఫెర్నాండో, దిల్షాన్‌ మధుషనక.

Read Also : Sports Drama Films: ఇప్పుడంతా స్పోర్ట్స్ డ్రామాలే.. ఆటగాళ్లవుతున్న స్టార్స్