5 State Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలి: బార్ అసోసియేషన్

దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలని అఖిల భారత బార్ అసోసియేషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది

5 State Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలి: బార్ అసోసియేషన్

Elecctiosn

5 State Elections: దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలని అఖిల భారత బార్ అసోసియేషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దేశంలో కరోనా, ఒమిక్రాన్ వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని సూచించారు. గతంలో అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల సమయంలో భారతదేశ ప్రజల నిర్లక్ష్యం కారణంగా కోవిడ్-19 సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా వ్యాప్తి చెందిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కొత్త వేరియంట్లు విజృంభిస్తుండడంతో రానున్న రోజుల్లో దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా పెద్ద సంఖ్యలో ఎన్నికల ర్యాలీలకు తరలివస్తున్నారని.. ఒమిక్రాన్, కరోనా ముగిసే వరకు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేయకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని బార్ అసోసియేషన్ పేర్కొంది.

Also read: Kothagudem News: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య: ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా చైనా, నెదర్లాండ్స్, జర్మనీ తదితర దేశాలలో పాక్షిక లేదా పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేశారన్న బార్ అసోసియేషన్.. భారత్ లో ఎన్నికల సంఘం దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత గురించి పట్టించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తుందని విమర్శించారు. భారత్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచారం కారణంగా కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగి మరోమారు లాక్ డౌన్ పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని బార్ అసోసియేషన్ సభ్యులు వివరించారు.

Also Read: Corona in Cruise: క్రూయిజ్ షిప్ లో ఒకరికి కరోనా పాజిటివ్, ఓడ నిలిపివేత