Bihar : పెళ్లి ప‌త్రిక‌ల‌పై క‌ట్నం తీసుకోవ‌డం లేద‌ని ప్రకటించిన పెళ్లిళ్లకే వెళుతున్నా..: సీఎం నితీశ్ కుమార్

పెళ్లి ప‌త్రిక‌ల‌పై క‌ట్నం తీసుకోవ‌డం లేద‌ని ప్రకటించిన పెళ్లిళ్లకే వెళుతున్నా అని బీహార్ సీఎం సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఓ మ‌హిళ‌ను పురుషుడు పెళ్లి చేసుకుంటేనే సంతానం క‌లుగుతుంద‌ని, ఒక‌వేళ ఓ మ‌గాడు మ‌రో మ‌గాడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు సంతానం పరిస్థితి ఏంటి అంటూ ప్ర‌శ్నించారు.

Bihar : పెళ్లి ప‌త్రిక‌ల‌పై క‌ట్నం తీసుకోవ‌డం లేద‌ని ప్రకటించిన పెళ్లిళ్లకే వెళుతున్నా..: సీఎం నితీశ్ కుమార్

Bihar Cm Nitish Kumar

Bihar : పెళ్లి ప‌త్రిక‌ల‌పై క‌ట్నం తీసుకోవ‌డం లేద‌ని ప్రకటించిన పెళ్లిళ్లకే వెళుతున్నా అని బీహార్ సీఎం సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఓ మ‌హిళ‌ను పురుషుడు పెళ్లి చేసుకుంటేనే సంతానం క‌లుగుతుంద‌ని, ఒక‌వేళ ఓ మ‌గాడు మ‌రో మ‌గాడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు సంతానం పరిస్థితి ఏంటి అంటూ ప్ర‌శ్నించారు. పాట్నాలో గ‌ర్ల్స్ హాస్ట‌ల్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా నితీశ్ కుమార్ ఇటువంటి వింత విచిత్రమైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అలాగే వ‌ర‌క‌ట్న వ్య‌వ‌స్థ నిర్మూల‌న కోసం బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఓ కామెంట్ చేశారు. పెళ్లి కోసం వ‌ర‌క‌ట్నం తీసుకోవ‌డం వ్య‌ర్థమ‌ని మ‌రోసారి నితీశ్ అన్నారు. అంతేకాదు..ఓ మ‌హిళ‌ను పురుషుడు పెళ్లి చేసుకుంటేనే సంతానం క‌లుగుతుంద‌ని, ఒక‌వేళ ఓ మ‌గాడు మ‌రో మ‌గాడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు సంతానం ఏమ‌వుతుంది? అంటూ ప్ర‌శ్నించారు. వ‌రక‌ట్నం అనే వ్య‌వ‌స్థ‌ ఓ సామాజిక భూతం అని అన్నారు.

వరకట్న సమస్యను రూపుమాపాల్సిన అవసరం చాలా ఉందని ఇది అందరి బాధ్యత అనిఅన్నారు. క‌ట్న వ్య‌వ‌స్థ ప్ర‌స్తుత స‌మాజంలో స‌రైంది కాదు అని స్పష్టంచేసిన నితిశ్దాన్ని అంతం చేయ‌డం అందరి బాధ్య‌త అని..అప్పుడే స‌రైన వ్య‌వ‌స్థ ఏర్పడుతుంద‌ని అన్నారు. పెళ్లి ప‌త్రిక‌ల‌పై క‌ట్నం తీసుకోవ‌డం లేద‌ని రాసిన పెండ్లీల‌కు హాజ‌ర‌వుతున్న‌ానని ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. వ‌ర‌క‌ట్నం, బాల్య వివాహాల‌ను అరిక‌ట్టే ఉద్దేశంతో 2017లో నితీశ్ కుమార్ రాష్ట్ర‌వ్యాప్త ఉద్య‌మం చేప‌ట్టారు.

Also read : Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు

తాము చదువుకునే రోజుల్లో తమ తరగతి గదిలో ఒక్క అమ్మాయి కూడా లేదని..తాను ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో..తమ తరగతిలో ఒక్క మహిళా విద్యార్థి కూడా ఉండేది కాదని..ఎంతో బాధగా ఉండేదని సీఎం నితీశ్ అన్నారు. ఎపుడైనా ఒక్క అమ్మాయి తమ తరగతి గది వైపు వస్తే..అబ్బాయిలందరూ గుమిగూడి ఆ యువతిని చూసేందుకు ఎగబడేవారని ఈ సందర్బంగా సీఎం నితీశ్ కుమార్ తాను చదువుకున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పరిస్థితి అలా ఉండేదని..ఇప్పుడు బాలికలు సైతం చదువుల్లో ఎంతో ముందున్నారని సీఎం నితీశ్ అన్నారు.

మహిళల చదువు, సమాజంలో వారి పట్ల ఉన్న చిన్నచూపు వంటి వివరాలపై అప్పటి – ఇప్పటి పరిస్థితులను వివరిస్తూ సీఎం నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాలికల కోసం విద్యాసంస్థల్లో సీట్లు రిజర్వ్ చేసామని, తద్వారా మహిళలు సాంకేతిక విద్యను ఎంచుకుని డాక్టర్లు మరియు ఇంజనీర్లు అవుతారని సీఎం అనాన్రు. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించి, ఉన్నత స్థాయి అధికారులుగా తీర్చి దిద్దడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది, ”అని సీఎం నితీశ్ కుమార్ చెప్పారు.