Bhatti Vikramarka : మోదీ ప్రధానిగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదు-భట్టి విక్రమార్క

నరేంద్రమోదీ పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకిలా మాట్లాడారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు.

Bhatti Vikramarka : మోదీ ప్రధానిగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదు-భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

Bhatti Vikramarka : తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హడావుడిగా విభజించిందని, ఈ కారణంగా ఏర్పడిన విద్వేషం ఈరోజుకి కూడా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నష్టం చేకూర్చుతోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ను నిందిస్తూ మోదీ చేసిన ఆరోపణలు, విమర్శలు అగ్గి రాజేశాయి.

మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రధానిపై ఎదురుదాడికి దిగారు. నరేంద్రమోదీ పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకిలా మాట్లాడారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ ముందు నుంచి వ్యతిరేకమే అని అన్నారు. 2004లో ఏర్పాటు కావాల్సిన తెలంగాణ 2014 వరకు వెళ్లడానికి కారణం బీజేపీనే అని ఆరోపించారు.

Coconut Sugar : షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే కొబ్బరి చక్కెర

పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ లేకున్నా ఇతర పార్టీలను ఒప్పించి తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ఇచ్చిందనే విషయం తెలుస్తుందన్నారు. అధికారమే పరమావధి అనుకుంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేది కాదన్నారు. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు భట్టి విక్రమార్క. సమస్యల పరిష్కారం కోసమే విభజన చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారని చెప్పారు.

Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!

అయితే, ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లాయని, అది తట్టుకోలేకనే ఇవాళ ప్రధాని మోదీ ఇలా మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. సంపూర్ణ తెలంగాణను కాంగ్రెస్ ఇస్తే.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 7 మండలాలను ఏపీలో కలిపిందన్నారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీని హడావుడిగా విభజించారని.. కేంద్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీని ఎంతో సిగ్గు పడే విధంగా విభజించారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. విభజన అంశంలో ఎలాంటి చర్చ జరపకుండానే విభజన ప్రక్రియ చేసేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియ సరిగా లేని కారణంగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర విభజనతో ఏర్పడిన విద్వేషం ఈరోజుకి కూడా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నష్టం చేకూర్చుతోందని ప్రధాని మోదీ వాపోయారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాలేకపోయిందన్నారు ప్రధాని మోదీ.