Bhatti Vikramarka : మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు : బండి సంజయ్‌పై భట్టివిక్రమార్క ఫైర్

భాగ్యలక్ష్మి ఆలయాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్‌ మతిస్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. రాజయకీయ లబ్ధి కోసం సంజయ్‌ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

Bhatti Vikramarka : మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు : బండి సంజయ్‌పై భట్టివిక్రమార్క ఫైర్

Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఫైర్‌ అయ్యారు. బండి సంజయ్‌ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంపై చెయ్యి వేస్తే.. ఏం జరుగుతుంతో చూడండంటూ కాంగ్రెస్‌ నేతలను హెచ్చరించడంపై భట్టి మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్‌ మతిస్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. రాజయకీయ లబ్ధి కోసం సంజయ్‌ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

ప్రముఖ చారిత్రక కట్టడం చార్మినార్‌ చుట్టూ సరికొత్త వివాదం నెలకొంది. చార్మినార్‌లో ప్రార్ధనలకు అనుమతి ఇవ్వాలంటూ స్థానిక కాంగ్రెస్‌ నేతలు లేవనెత్తిన డిమాండ్ రాజకీయ చిచ్చు రేపింది. కాంగ్రెస్ నేత రషీద్‌ఖాన్ ప్రతిపాదనపై సొంత పార్టీతో పాటు.. బీజేపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ వినిపిస్తున్నాయి. చార్మినార్, దిగువనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఏ ఒక్కరిదీ కాదంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

V Hanumantha rao: భాగ్యలక్ష్మి ఆల‌యం గురించి బండి సంజ‌య్ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు: వీహెచ్‌

చార్మినార్‌లో ప్రార్ధనలకు అనుమతి ఇవ్వాలంటూ స్థానిక కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సంతకాల సేకరణకు దిగారు. మక్కా మసీదు ఎదుట సంతకాల సేకరణకు దిగడం ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీసింది. గతంలో చార్మినార్‌లో ప్రార్ధనలు జరిగేవని అయితే రెండు దశాబ్దాల క్రితం దాన్ని నిలిపివేశారని స్థానిక కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. చార్మినార్‌లో మసీదును తెరవకుంటే భాగ్యలక్ష్మి ఆలయాన్ని కూడా మూసేయాలని స్థానిక కాంగ్రెస్‌ నేత రషీద్‌ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. అది అనధికారిక కట్టడం అంటూ ఆరోపించారు.

కాంగ్రెస్‌ నేత రషీద్‌ఖాన్ సంతకాల సేకరణపై టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయంపై చేయి వేయాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తాము భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటేనే మీకు నమాజ్ గుర్తొచ్చిందా అంటూ సంజయ్ ప్రశ్నించారు. అక్కడ గుడి లేదు అని చెప్పేవాడు మూర్ఖుడన్నారు. సంతకాల సేకరణను ముస్లిం సమాజం హర్షించదని బండి సంజయ్ అన్నారు.