CM KCR : ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలి : సీఎం కేసీఆర్‌

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణలో 15రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన 15 ఆగస్ట్‌ ముందు వారం రోజులు.. అనంతరం వారం రోజులుగా.. 15 రోజుల పాటు 'భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ' కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

CM KCR : ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలి : సీఎం కేసీఆర్‌

Kcr

CM KCR : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణలో 15రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన 15 ఆగస్ట్‌ ముందు వారం రోజులు.. అనంతరం వారం రోజులుగా.. 15 రోజుల పాటు ‘భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

తెలంగాణలోని ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకు అవసరమైన 1 కోటి 20 లక్షల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు గద్వాల, నారాయణ పేట్, సిరిసిల్ల, పోచంపెల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీద జాతీయ పతాకాన్ని అత్యున్నతంగా ఎగరవేయాలన్నారు. జాతీయ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని జీఏడీ అధికారులను సీఎం ఆదేశించారు.

Indian National Flag : భారత జాతీయ పతాకానికి వందేళ్లు..జెండా రూపశిల్పి ఎవరంటే?

పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల వారి సారథ్యంలో పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్య్ర వజ్రోత్సవ దీప్తిని వెలిగించే దిశగా తగు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తెలంగాణనుంచి, దేశంలోని పలు ప్రాంతాలనుంచి, దేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న నాటితరం జాతీయ నాయకుల వివరాలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు యువత కోసం అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.