Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళుతున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలపనున్నారు.

Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

Cm Kcr Will Go To Delhi To Wish President Draupadi Murmu

President Draupadi Murmu : ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళుతున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలపనున్నారు. కాగా..ఎన్నికల్లో రాష్ట్రపతిగా విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం (జులై 25,2022) ప్రమాణస్వీకారం చేశారు.

ఆదివాసీల కుటుంబంలో పుట్టి కౌన్సిలర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రపతి అయినా ద్రౌపది ముర్ముకు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు అందుతున్నాయి. ఆదివాసీల బిడ్డ కొత్త చరిత్ర సృష్టించారంటూ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, రాష్ర్ట మంత్రులు అభినందనలు తెలియజేశారు. రాష్ర్టపతి ఎన్నికల్లో ముర్ముపై పోటీ చేసి ఓటమిపాలైన విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా అభినందనలు తెలియజేశారు.

కానీ..ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈక్రమంలో కేవలం ఫోన్ లో కాకుండా స్వయంగా ద్రౌపది ముర్ముతో భేటీ అయి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఢిల్లీ వెళుతున్నారు సీఎం కేసీఆర్. కాగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.