Coronavirus: దేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువగా కరోనా కేసులు

దేశంలో ప్రతిరోజూ సుమారు 15 వేల కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Coronavirus: దేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువగా కరోనా కేసులు

Corona Cases 11zon

Coronavirus Update: దేశంలో ప్రతిరోజూ సుమారు 15 వేల కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,306 కరోనా కేసులు వచ్చాయి. మునుపటిరోజు కంటే కేసులు కొంచెం తగ్గాయి. ఇదే సమయంలో 443మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 18,762 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4,899 యాక్టివ్ కేసులు తగ్గాయి.

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మూడు కోట్ల 41 లక్షల 89 వేల మంది కరోనాకు గురయ్యారు. వీరిలో నాలుగు లక్షల 54 వేల 712 మంది చనిపోగా.. ఇప్పటివరకు 3 కోట్ల 45 లక్షల 67 వేల మంది కోలుకున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షల కన్నా తక్కువగా ఉంది. మొత్తం లక్షా 67 వేల 695మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.

కరోనా కేసులు – మూడు కోట్ల 41 లక్షల 89 వేల 774
కోలుకున్నవారు – మూడు కోట్ల 35 లక్షల 67 వేల 367
మొత్తం యాక్టివ్ కేసులు – ఒక లక్ష 67 వేల 695
చనిపోయినవారు- నాలుగు లక్షల 54 వేల 712
వ్యాక్సినేషన్ – 102 కోట్ల 27 లక్షల 12 వేల డోసులు ఇచ్చారు

కేరళలో 8,538 కొత్త కరోనా కేసులు:
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా కేరళలో మాత్రం కొత్తగా 8వేల 538 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 49 లక్షల 6 వేల 125కి పెరిగింది. గడిచిన 24గంటల్లో 363 మంది కేరళలో చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 28,592కు చేరుకుంది. ఇదే సమయంలో 11,366 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 48లక్షల 8వేల 775కు చేరుకుంది. చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 77,363గా ఉంది.

వ్యాక్సినేషన్:
అక్టోబర్ 24వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 102 కోట్ల 27 లక్షల 12 వేల డోసుల కరోనా వ్యాక్సిన్‌లు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చివరిరోజు 12.30 లక్షల వ్యాక్సిన్‌లు వేశారు. అదే సమయంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, 60 కోట్ల కరోనా పరీక్షలు జరిగాయి.

దేశంలో కరోనా మరణాల రేటు 1.33 శాతం కాగా రికవరీ రేటు 98.17 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.51 శాతంగా ఉండగా.. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారతదేశం ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్యలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అమెరికా తర్వాత, బ్రెజిల్, భారతదేశంలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

Read More:

ఈ మూడు కాంపాక్ట్ SUVలు సెప్టెంబరులో అత్యధికంగా అమ్ముడయ్యాయి

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. నాలుగు నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత

ఓడిపోయిన మ్యాచ్‌లో రికార్డు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా!