Cyber Crimes: సైబర్ నేరగాళ్లకు చెక్.. ఆధార్ ద్వారా పట్టేస్తున్న పోలీసులు

సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సైబర్ ప్రపంచాన్ని మంచికి వాడుకునేవారు ఎందరో.. కానీ, కొందరు నేరగాళ్లు మాత్రం సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

Cyber Crimes: సైబర్ నేరగాళ్లకు చెక్.. ఆధార్ ద్వారా పట్టేస్తున్న పోలీసులు

Cyber Crime

Cyber Experts Catching Criminals Via Aadhar Card Linking: సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సైబర్ ప్రపంచాన్ని మంచికి వాడుకునేవారు ఎందరో.. కానీ, కొందరు నేరగాళ్లు మాత్రం సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు మన అకౌంట్లోకి ప్రవేశించి డబ్బులు తీసేస్తున్నారు. మనం చేసే చిన్న పొరపాట్లే, పొరపాటు అని తెలిసేలోపే ప్రైవసీని దెబ్బ తీసి డబ్బులు దోచేసుకుంటున్నారు.

ఇటువంటి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి కూడా.. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) సహకారంతో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఓ పద్ధతిలో వీరి ఆట కట్టించేందుకు సిద్ధం అయ్యారు. సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము చివరకు చేరేది వారి బ్యాంకు ఖాతాలకే, కాబట్టి వాటిని గుర్తించి, ఎక్కడికక్కడ ఫ్రీజ్‌ చేసి దోపిడీకి అడ్డుకట్ట వేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా దీనిని స్టార్ట్ చేసి విజయవంతంగా అమల్లోకి తీసుకుని వచ్చారు సైబర్ క్రైమ్ అధికారులు.

ఈ క్రమంలోనే ఎక్కువగా గుర్తించినవి ఈ అకౌంట్లు అన్నీ దాదాపుగా వేరే రాష్ట్రాల్లోనే ఉండి మెయింటైన్ చేస్తున్నారు. వారు బినామీలవి బ్యాంకు ఖాతాల సాయంతో కమీషన్‌ పద్ధతిలో దోపిడీకి వాడుకుంటారు. డబ్బు ఆశతో బినామీలు ఒక్కొక్కరు పది, పదిహేను బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో ఆధార్‌ కార్డు తప్పనిసరి కావటంతో అన్ని ఖాతాలకు ఆధార్‌ లింక్‌ అయ్యి ఉంటుంది.

ఇప్పుడు ఇదే ఆధార్ లింక్ పోలీసులకు ప్రధాన అస్త్రంగా మారింది. నేరగాడు ఏ బ్యాంకు ఖాతా ఉపయోగించాడో ఆ ఖాతాపైనే దర్యాప్తు అధికారులు దృష్టిపెట్టి.. ఆ అకౌంట్లు అన్నింటినీ పోలీసులు ఫ్రీజ్‌ చేస్తున్నారు. దీంతో నేరం చేసేవారికి బినామీ అకౌంట్లు లేకుండా పోతున్నాయి. సైబర్‌ నేరాలను అడ్డుకోవడం, నేరానికి పాల్పడినవారిని పట్టుకోవడం, బాధితులను ఆర్థికంగా నష్టపోకుండా పటిష్ట చర్యలు చేపట్టడడమే ముఖ్య ఉద్ధేశ్యం అని చెబుతున్నారు పోలీసులు.