ED Attach Amway Assets : ఆమ్‌వేకు ఈడీ బిగ్ షాక్.. రూ.757 కోట్ల ఆస్తులు అటాచ్

డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారంలో భారీ నెట్‌వ‌ర్క్‌ను సొంతం చేసుకున్న ఆమ్‌వే(Amway) సంస్థ‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) షాక్..

ED Attach Amway Assets : ఆమ్‌వేకు ఈడీ బిగ్ షాక్.. రూ.757 కోట్ల ఆస్తులు అటాచ్

Ed Attach Amway Assets

ED Attach Amway Assets : డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ (గొలుసు క‌ట్టు) వ్యాపారంలో భారీ నెట్‌వ‌ర్క్‌ను సొంతం చేసుకున్న ఆమ్‌వే(Amway) సంస్థ‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఆమ్‌వే కంపెనీకి చెందిన రూ.757.77 కోట్ల ఆస్తుల‌ను అటాచ్ చేస్తూ ఈడీ కీల‌క నిర్ణయం తీసుకుంది. జ‌ప్తు చేసిన ఆస్తుల్లో స్థిర, చ‌రాస్తుల‌తో పాటు బ్యాంకు ఖాతాల్లోని న‌గ‌దు నిల్వ‌లు కూడా ఉన్నాయి.

గొలుసు క‌ట్టు వ్యాపారం మోసం కేసులో ఆమ్‌వే సంస్థ‌పై ఇదివ‌ర‌కే ప‌లు కేసులు న‌మోదు కాగా.. వాటి ఆధారంగా ఈడీ కూడా ఆమ్‌వేపై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లు కీల‌క ఆధారాల‌ను సేక‌రించిన ఈడీ అధికారులు వాటిని ఈడీ కోర్టుకు స‌మ‌ర్పించారు.(ED Attach Amway Assets)

అనంతరం కోర్టు ఆదేశాల‌తో ఆమ్‌వేకు చెందిన రూ.757.77 కోట్ల ఆస్తుల‌ను అటాచ్ చేశారు. అటాచ్ చేసిన ఆస్తుల్లో త‌మిళ‌నాడులోని దిండిగ‌ల్ జిల్లాలోని సంస్థ ప‌రిశ్ర‌మ భ‌వ‌నం, యంత్రాలు ఉన్నాయి. రూ.411.83 కోట్ల విలువ చేసే స్థిర‌, చరాస్తులు సీజ్ చేసిన ఈడీ.. 36 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 345.94 కోట్లను జ‌ప్తు చేసింది.

MP Sanjay Raut : శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌ ఈడీ షాక్..రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబర్ లో ఈ కంపెనీలకు కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు అందిస్తున్న పొడక్టులన్నీ రెగ్యులర్‌ మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, ఈ వ్యాపారంలో భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎంలో అతి పెద్ద సంస్థ అయిన ఆమ్వేకు భారీ షాక్‌ ఇచ్చింది ఈడీ.

* మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ ఆమ్‌వేకు ఈడీ షాక్

* రూ.757 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

* ఆస్తులతోపాటు ఫ్యాక్టరీలకు సంబంధించిన స్థలాలు సీజ్

* రూ.411 కోట్ల ఆస్తులు, రూ.345 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్రీజ్

* దేశవ్యాప్తంగా ఉన్న ఆమ్‌వే సంస్థ 36 అకౌంట్లను ఫ్రీజ్ చేసిన ఈడీ..

* ఇప్పటివరకు రూ.27,562 కోట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించిన ఈడీ..

* కమిషన్ రూపంలో రూ.7,588 కోట్ల చెల్లింపులు..

* అమెరికా, ఇండియాలో ఉన్న మెంబర్స్‌కు చెల్లింపులు..

* అమెరికాకు చెందిన బ్రిట్ వరల్డ్‌వైడ్, నెట్‌వర్క్ 21లో ఆమ్‌వే షేర్లు గుర్తింపు..

* ఉమ్మడి రాష్ట్రాల్లో ఆమ్‌వేపై మొదటిసారి సీఐడీ విచారణ..

* ఆమ్‌వే సీఈవోను కూడా అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు.