Nirav Modi: నీర‌వ్ మోదీకి మ‌రోసారి షాకిచ్చిన ఈడీ.. ఆ దేశంలోని రూ.253కోట్ల విలువైన ఆస్తులు సీజ్

మనీలాండరింగ్ విచారణలో భాగంగా పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో ముడిపడి ఉన్న కంపెనీలకు చెందిన రూ.253.62 కోట్ల విలువైన ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసినట్లు శుక్రవారం ఏజెన్సీ తెలిపింది.

Nirav Modi: నీర‌వ్ మోదీకి మ‌రోసారి షాకిచ్చిన ఈడీ.. ఆ దేశంలోని రూ.253కోట్ల విలువైన ఆస్తులు సీజ్

Nirav Modi

Nirav Modi: మనీలాండరింగ్ విచారణలో భాగంగా పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో ముడిపడి ఉన్న కంపెనీలకు చెందిన రూ.253.62 కోట్ల విలువైన రత్నాలు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసినట్లు శుక్రవారం ఏజెన్సీ తెలిపింది. దీంతో ఈ కేసులో అటాచ్ చేసిన, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 2,650.07 కోట్లకు చేరిందని ఈడీ వెల్ల‌డించింది.

Nirav Modi : నీరవ్ మోదీకి మరో షాక్

నీరవ్ మోడీ ప్రస్తుతం యూకే జైలులో ఉన్నారు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో రెండు బిలియన్ డాలర్ల మోసం కేసుకు సంబంధించి సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఇదిలాఉంటే ఈడీ లెక్క‌ల ప్ర‌కారం.. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రూ.6,498.20 కోట్ల మోసం కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002 (PMLA) కింద ECIR నమోదు చేయ‌డం ద్వారా దర్యాప్తు ప్రారంభించింది. PMLA దర్యాప్తు సమయంలో హాంకాంగ్‌లోని నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన కొన్ని ఆస్తులు ప్రైవేట్ వాల్ట్‌లలో పడి ఉన్న రత్నాలు, ఆభరణాలు, హాంకాంగ్‌లో నిర్వహించబడుతున్న ఖాతాలలోని బ్యాంక్ బ్యాలెన్స్‌ల రూపంలో గుర్తించారు. ఆర్డర్ PMLA-2002లోని సెక్షన్-5 కింద 253.62 కోట్లు అని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.

Varun Gandhi: వారంలోనే ఇలా అయితే ఎలా..? బీజేపీ స‌ర్కార్‌పై మ‌రోసారి వ‌రుణ్ గాంధీ ఫైర్‌

గతంలో, నీరవ్ మోడీ, ఆయ‌న సహచరులకు చెందిన 2,396.45 కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులను ఈడీ భారతదేశం, విదేశాలలో అటాచ్ చేసింది. అంతేకాక ముంబైలోని ప్రత్యేక కోర్టు (FEOA) పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018లోని నిబంధనల ప్రకారం నీరవ్ మోదీ, అతని సహచరుల మొత్తం రూ.1,389 కోట్ల చరాస్థి, స్థిరాస్తులను జప్తు చేసింది. జప్తు చేయబడిన ఆస్తులను భౌతికంగా అప్పగించే ప్రక్రియ పురోగతిలో ఉంది. జప్తు చేయబడిన ఆస్తులలో కొంత భాగాన్ని బ్యాంకులో డిపాజిట్లు చేసి న‌ష్ట‌పోయిన బాధితులకు అప్పగించడం జరిగింది.