Eatala Rajender: మాజీ మంత్రి చంద్రశేఖర్​తో ఈటల భేటీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

పార్టీలు మార్చడమంటే దుస్తులు మార్చినంత సులువేం కాదని చెప్పారు.

Eatala Rajender: మాజీ మంత్రి చంద్రశేఖర్​తో ఈటల భేటీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

Etela Rajender, Chandrasekhar

Eatala Rajender- BJP: బీజేపీ తెలంగాణ (Telangana) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇవాళ మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్​(Chandrasekhar)తో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ పై బీజేపీ నిర్ణయం తీసుకోవాలని చంద్రశేఖర్ కోరారు. అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళతానని ఈటల చెప్పారు.

అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్ బీజేపీని వీడతారన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే చంద్రశేఖర్, తాము కలసి పనిచేస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ అధ్యయనం చేస్తోందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ అనుకూలంగా ఉందని అన్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీని పలువురు నేతలు వీడుతున్నారనేది అవాస్తవం లేదని ఈటల రాజేందర్ అన్నారు. పార్టీలు మార్చడమంటే దుస్తులు మార్చినంత సులువేం కాదని చెప్పారు.

తాను ఇవాళ చంద్రశేఖర్ ను బుజ్జగించేందుకు చేసేందుకు రాలేదని చెప్పారు. బీజేపీలో అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యతలను బీజేపీ అధిష్ఠానం తాజాగా ఈటల రాజేందర్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రశేఖర్ కు ఈటల చెప్పినట్లు తెలుస్తోంది.

Etela Rajender : మాజీ మంత్రి చంద్రశేఖర్‎కి ఈటల బుజ్జగింపులు