Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. రూ.20వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. ఏ ఫోన్ బెటర్ అంటే?

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌‌కార్ట్ (Flipkart)లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ప్రారంభమైంది. మొత్తం 6 రోజుల పాటు సాగే ఈ సేల్ డిసెంబర్ 21న ముగుస్తుంది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. రూ.20వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. ఏ ఫోన్ బెటర్ అంటే?

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌‌కార్ట్ (Flipkart)లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ప్రారంభమైంది. మొత్తం 6 రోజుల పాటు సాగే ఈ సేల్ డిసెంబర్ 21న ముగుస్తుంది. ఈ సేల్ సందర్భంగా కేటగిరీలు, వివిధ బ్రాండ్‌లకు చెందిన ప్రొడక్టుల రేంజ్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మీరు కొత్త బడ్జెట్‌ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే రూ. 20వేల లోపు ఫోన్ల లిస్టు మీకోసం అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

పోకో X4 Pro 5G ఫోన్ :
పోకో నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో Poco X4 Pro 5G ఫోన్ ఒకటి.. ఇది 6GB RAM, 128GB స్టోరేజ్ కెపాసిటీతో Poco X4 Pro 5G ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,999కి విక్రయిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snap dragon 695 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లో 6.67-అంగుళాల Full HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. సెల్ఫీల కోసం కొనుగోలుదారులు ముందు భాగంలో 16MP కెమెరాను పొందవచ్చు.

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

Infinix నోట్ 12 5G ఫోన్ :
ఇన్ఫినిక్స్ నుంచి రిలీజ్ అయిన ఫోన్లలో (Infinix Note 12 5G) ఒకటి. ఈ ఫోన్ 6GB RAM, 64GB స్టోరేజీతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.13,999 వద్ద లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 810 5G చిప్‌సెట్‌తో వస్తుంది. డివైజ్ 5,000mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ 16MP కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు, హ్యాండ్‌సెట్ 2MP డెప్త్ లెన్స్, AI లెన్స్‌తో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది.

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

Read Also :  Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే? డోంట్ మిస్..!

మోటోరోలా G72 5G ఫోన్ :
మోటోరోలా స్మార్ట్‌‌ఫోన్లలో 31శాతం తగ్గింపుతో (Motorola G72) 5Gని రూ.14,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G99 octa-core ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Android ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో వెనుకవైపు 108MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. 8MP, 2MP ఇతర సెన్సార్‌లతో వస్తుంది.

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

ఒప్పో F19 Pro+ 5G ఫోన్ :
ఒప్పో నుంచి (Oppo F19 Pro+ 5G) ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఇందులో 8GB RAM, 128GB స్టోరేజ్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,490 తగ్గింపు ధరతో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ 5G-రెడీ ఫోన్. MediaTek Dimensity 8000U ప్రాసెసర్‌తో వస్తుంది. 6.43-అంగుళాల Full HD+ డిస్‌ప్లేతో వస్తుంది.

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

రియల్‌మి 9 Pro 5G ఫోన్ :
రియల్‌మి ఫోన్లలో (Realme 9 Pro 5G) ఫోన్ 6GB, 8GB RAM వేరియంట్లలో అందిస్తోంది. 6GB RAM మోడల్‌ని ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 5,000mAh బ్యాటరీ సపోర్టుతో వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఐదు స్మార్ట్‌ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనుగోలు చేయండి.

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

Flipkart Big Saving Days Sale Begins _ Deals on smartphones under Rs. 20,000

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్ బిగ్ డీల్స్..!