Appalayagunta : గరుడ వాహనంపై ప్రసన్నవేంకటేశ్వర స్వామి వారు

తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో   వేంచేసి యున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు విశేష‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిచ్చారు.

Appalayagunta : గరుడ వాహనంపై ప్రసన్నవేంకటేశ్వర స్వామి వారు

appalayagunta

Appalayagunta :  తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో   వేంచేసి యున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు విశేష‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

New Project (3)

స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు.

New Project (2)

గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుంద‌ని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఇతక అధికారులు భక్తులు పాల్గోన్నారు.

Also Read : Tirumala : ముగిసిన జ్యేష్టాభిషేకం