OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ బిగ్ మూవీస్!

ధియేటర్లే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల పండగ స్టార్టయ్యింది. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఓటీటీ లోకి రాబోతున్నాయి. ఏదో అల్లా టప్పా చిన్న సినిమాలు కాదు..

OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ బిగ్ మూవీస్!

Ott Release

OTT Release: ధియేటర్లే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల పండగ స్టార్టయ్యింది. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఓటీటీ లోకి రాబోతున్నాయి. ఏదో అల్లా టప్పా చిన్న సినిమాలు కాదు.. భీమ్లానాయక్, రాధేశ్యామ్ లాంటి బ్లాక్ బస్టర్ బిగ్ మూవీస్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. మరి ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలోకి రాబోతోందో డీటెయిల్డ్ గా చూద్దాం.

Radhe Shyam: గ్లోబల్ స్టార్ ప్రభాస్.. ఇకనైనా కాస్త ఆలోచించవయ్యా!

ధియేటర్లో ఇలా సందడి చేసిన సినిమాలు ఇప్పుడు మనింటికే వస్తున్నాయి. ధియేటర్లో మిస్ అయిన వాళ్లు.. మళ్లీ మళ్లీ సినిమాను చూడాలనుకునేవాళ్లు ఓటీటీలో స్టార్ ఫిల్మ్ ఫెస్టివల్ కి రెడీ అవుతున్నారు. ఎందుకంటే.. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటీటీ లోకి రాబోతున్నాయి. మొన్నీమధ్య రిలీజ్ అయిన రాధేశ్యామ్ అప్పుడే ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Bheemla Nayak Bike: ‘ఆహా’ బంపర్ ఆఫర్.. పవన్ బైక్ సొంతం చేసుకొనే ఛాన్స్!

ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యింది. రికార్డ్ ధియేటర్లలో మార్చి 11న రిలీజ్ అయిన రాధేశ్యామ్.. స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కోసం ఓటీటీలోకి రాబోతోంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉగాది కానుకగా ఏప్రిల్ 2న అమెజాన్ ప్రైమ్ లో ఆడియన్స్ ముందుకురాబోతోందని న్యూస్ వైరల్ అవుతోంది.

Aadavallu Meeku Johaarlu: అప్పుడు వెంకీ అందుకే కాదన్నాడా?

బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన భీమ్లానాయక్.. ధియేటర్లలో ఇంకా దుమ్ము రేపుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా సాగర్ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కి ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో ధియేటర్లలోకి వచ్చిన భీమ్లా.. అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసిన భీమ్లా, అదే స్పీడ్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మార్చి 25న ఆహా, హాట్ స్టార్ యాప్స్ లో స్ట్రీమింగ్ కి భీమ్లానాయక్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Radhe Shyam: భీమ్లా నాయక్‌ను టచ్ చేయలేకపోయిన రాధేశ్యామ్!

ఓటీటీలోకి వస్తున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ ఆడవాళ్లూ మీకుజోహార్లు. శర్వానంద్, రష్మిక జంటగా రిలీజ్ అయిన ఆడవాళ్లూ మీకు జోహార్లు.. ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సీనియర్ స్టార్ కాస్ట్ తో హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమా మార్చి 25నే సోనీ లివ్ లో ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Bheemla Nayak: RRR రిలీజ్ రోజున పవన్ డబుల్ ధమాకా!

విమెన్ సెంట్రిక్ మూవీగా రిలీజ్ అయ్యి 100కోట్లు కొల్లగొట్టిన గంగూభాయ్ కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఆలియా భట్ లీడ్ రోల్ లో అజయ్ దేవ్ గన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన గంగూభాయ్ కతియావాడి సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కోవిడ్ తర్వాత బాలీవుడ్ లో మహామహా స్టార్లు కూడాసాధించలేని 100 కోట్ల కలెక్షన్ల రేర్ ఫీట్ సాధించి విమెన్ పవర్ చూపించింది ఆలియాభట్. ఇంత క్రేజ్ సంపాదించుకున్న గంగూభాయ్ కతియావాడి సినిమా ఏప్రిల్ 25న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది.

Bheemla Nayak : ‘రాధేశ్యామ్’ రాకతో ‘భీమ్లా నాయక్’కి దెబ్బ.. నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్స్..

తమిళ్ స్టార్ హీరోల పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతున్నాయి. సూర్య,ప్రియాంకా మోహన్ జంటగా సోషల్ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈటి సినిమా ధియేటర్లు మంచి టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 1న సన్ నెక్ట్స్, నెట్ ఫ్లిక్స్ లో జాయింట్ గా ఓటీటీ ఆడియన్స్ ముందుకొస్తోంది.

Valimai: రూ.100 కోట్ల క్లబ్‌లో వలిమై.. ఆల్ టైమ్ రికార్డులను సెట్ చేస్తున్న అజిత్

మరో స్టార్ హీరో అజిత్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ వలిమై కూడా ఓటీటీ కొస్తోంది. అజిత్ సూపర్ కాప్ రోల్ లో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా హ్యూమా ఖురేషి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వలిమై మూవీ యాక్షన్ లవర్స్ కి విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు ఆ బిగ్ స్క్రీన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్ పీరియన్స్ ని మార్చి 25 నుంచి జీ 5 ఓటీటీ యాప్ చూపించేందుకు రెడీ అయ్యింది.

Valimai: ప్రోమోకు పెయిడ్ లైక్స్.. నెట్టింట యాంటీ ఫాన్స్ దుమారం!

ఈ సినిమాలతో పాటు. .రిలీజ్ కోసం రెండేళ్లు వెయిట్ చేసి.. డిసెంబర్ లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ 83.. కూడా ఫైనల్లీ ఓటీటీకి రాబోతోంది. లాస్ట్ మన్త్ నుంచి ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఈనెలలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ జంటగా నటించిన 83 మూవీ డిస్నీహాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది.