HIV-AIDS: హెచ్ఐవీకి చికిత్స.. కనుగొన్న శాస్త్రవేత్తలు

హెచ్ఐవీని అదుపు చేసేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఏవీ సత్ఫలితాల్ని ఇవ్వలేవు. కానీ, ఇప్పుడు హెచ్ఐవీకి చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్ఐవీ నివారణకు ఉపయోగపడే ఔషధాన్ని రూపొందించారు.

HIV-AIDS: హెచ్ఐవీకి చికిత్స.. కనుగొన్న శాస్త్రవేత్తలు

Hiv Aids

HIV-AIDS: ఇప్పటివరకు పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో లేని వ్యాధుల్లో హెచ్ఐవీ-ఎయిడ్స్ ఒకటి. హెచ్ఐవీని అదుపు చేసేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఏవీ సత్ఫలితాల్ని ఇవ్వలేవు. కానీ, ఇప్పుడు హెచ్ఐవీకి చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్ఐవీ నివారణకు ఉపయోగపడే ఔషధాన్ని రూపొందించారు.

Boy Rescued: బోరుబావిలో బాలుడు.. 110 గంటల తర్వాత సురక్షితంగా..

ఒక వ్యాక్సిన్ ద్వారా హెచ్ఐవీని నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. టైప్-బి అనే వైట్ బ్లడ్ సెల్స్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కణాలు హెచ్ఐవీ వైరస్‌ను అంతం చేసి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ‘‘ఈ వ్యాక్సిన్ సురక్షితమైంది. సమర్ధవంతమైంది. నమ్మదగింది. అంటువ్యాధుల్ని నియంత్రించడమే కాదు.. క్యాన్సర్ లాంటి వ్యాధుల నియంత్రణలోనూ ఉపయోగపడుతుంది’’ అని వ్యాక్సిన్ తయారీదారులు అంటున్నారు. ఇంజక్షన్ రూపంలో ఉండే ఈ వ్యాక్సిన్‌ను ఒక్కసారి ఇస్తే చాలు. ఇప్పటికే జరిపిన ప్రయోగాల్లో బి సెల్స్ సత్ఫలితాల్ని ఇచ్చాయి. బి సెల్స్ అనేవి ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్స్. ఇవి శరీరంలోకి చేరే వైరస్‌, బ్యాక్టీరియాను నియంత్రించగలిగే యాంటీబాడీస్‌ను అభివృద్ధి చేస్తాయి.

5G spectrum: 5జీ వేలానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

సాధారణంగా వైరస్‌లు విడిపోయి, రూపం మార్చుకుంటాయి. అయితే, ఈ బి సెల్స్ కూడా వైరస్ మారగానే తమ రూపాన్ని కూడా మార్చుకుంటాయి. సైంటిస్టులు బి సెల్స్ రూపొందించేందుకు సీఆర్ఐఎస్‌పీఆర్ టెక్నాలజీని వాడారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ బి సెల్ ఇంజెక్షన్ మరికొన్నేళ్లలో పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తుందని సైంటిస్టులు అంటున్నారు.