PM Modi Foreign Visit: ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశాల పర్యటనకు ఖర్చు ఎంతైందో తెలుసా?

ప్రధాని మోదీ విదేశాల పర్యటనలకు సంబంధించిన ఖర్చు వివరాలను వెల్లడించాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

PM Modi Foreign Visit: ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశాల పర్యటనకు ఖర్చు ఎంతైందో తెలుసా?

PM MODI

Updated On : December 9, 2022 / 3:24 PM IST

PM Modi Foreign Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో అనేకసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఈ పర్యటనల్లో భాగంగా ఇతర దేశాలతో పలు వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు గడిచిన ఐదేళ్లలో 36సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది.

PM Modi : నేడు ప్రధాని మోదీతో రష్యా మంత్రి భేటీ.. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చ

ప్రధాని మోదీ విదేశాల పర్యటనలకు సంబంధించిన ఖర్చు వివరాలను వెల్లడించాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ. 239 కోట్లుకుపై ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్లారు. ఈ పర్యటనకోసం ప్రభుత్వం రూ. 32,09,760 ఖర్చు చేసిందని తెలిపారు.

పారిస్ లో మోడీకి ఘన స్వాగతం

సెప్టెంబరు 26-28 మధ్య ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు రూ. 23,86,536 ఖర్చు చేసినట్లు మంత్రి రాజ్యసభలో తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని యూరప్ పర్యటన వివరాలను తెలియజేస్తూ, మొత్తం ఖర్చు రూ. 2,15,61,304 కాగా, సెప్టెంబర్ 21-28, 2019 మధ్య కాలంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు రూ. 23,27,09,000 ఖర్చయిందని మురళీధరన్ రాజ్య సభలో తెలియజేశారు.