Covid-19 : దేశంలో నిన్న కొత్తగా 15,823 కోవిడ్ కేసులు

  దేశంలో కొత్తగా నిన్న 15,823 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Covid-19 : దేశంలో నిన్న కొత్తగా 15,823 కోవిడ్ కేసులు

National Covid Update

Covid-19 :  దేశంలో కొత్తగా నిన్న 15,823 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. కాగా మొన్న 14,313 కేసులు నమోదు కాగా…. నిన్న  నమోదైన కేసుల్లో  10.5 శాతం పెరుగుదల కనిపించింది.

ఇక దేశవ్యాప్తంగా 2,07,653 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,33,42,901 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,51,189 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో 226 మంది మరణించగా, 22,844 మంది కరోనా నుంచి బయటపడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,33,42, 901 మంది కోవిడ్ నుంచి కోలుకుని బయట పడ్డారు. దీంతో రికవరీ రేటు 98.06గా నమోదైంది.

Also Read : DMK MP TRVS Ramesh : బలవంతంగా విషం తాగించి హత్య చేసిన కేసులో డీఎంకే ఎంపీ కోర్టులో లొంగుబాటు

దేశవ్యాప్తంగా నిన్న అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదైన మొదటి ఐదురాష్ట్రాల్లో కేరుళలో 7,823 కేసులు, మహారాష్ట్రంలో 2,069 కేసులు, తమిళనాడులో 1,289 కేసులు మిజోరంలో 1,224 కేసులు పశ్చిమ బెంగాల్ లో 768 కేసులు నమోదయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతున్నది. ఇప్పటివరకు 96,43,79,212 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. ఇందులో మంగళవారం ఒక్కరోజే 50,63,845 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా, అక్టోబర్‌ 12 వరకు దేశవ్యాప్తంగా 58,63,63,442 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) వెల్లడించింది. ఇందులో నిన్న ఒకేరోజు 13,25,399 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపింది.