India Corona Cases : భారత్ లో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 2,86,384 పాజిటివ్ కేసులు

దేశంలో ఇప్పటివరకు 4,03,71,500 కేసులు, 4,91,700 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు.

India Corona Cases : భారత్ లో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 2,86,384 పాజిటివ్ కేసులు

India Corona

india new corona cases : భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 2,86,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 573 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 5.46 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 19.59 శాతానికి చేరుకుంది.

దేశంలో ఇప్పటివరకు 4,03,71,500 కేసులు, 4,91,700 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 3,76,77,328 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Delhi CM Kejriwal : ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఫోటోలు మాత్రమే ఉండాలని ఆదేశం

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో ఏకంగా 2 కోట్ల మందికి పైగా కొవిడ్‌ సోకింది. కొవిడ్‌ వ్యాప్తి మొదలైన తర్వాత ఒకే ఒక వారంలో ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈవివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గత వారం రోజుల్లో.. పశ్చిమాసియా దేశాల్లో 39 శాతం, ఆగ్నేయాసియా దేశాల్లో 36 శాతం మేర కొవిడ్‌ కేసులు పెరిగాయని పేర్కొంది.

జనవరి 17నుంచి 23తో ముగిసిన వారంలో భారత్‌లో కేసులు 33 శాతం పెరిగాయని తెలిపింది. ఈ వ్యవధిలో దేశంలో కొత్తగా 21లక్షల 15 వేల మందికి కొవిడ్‌ సోకిందని వివరించింది. అంటే ప్రతిరోజు సగటున 3 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ఇక ఇదే సమయంలో భారత్‌తో పోల్చుకుంటే అమెరికాలో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ అత్యధికంగా 42లక్షల 15 వేల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

TATA Air India : 70ఏళ్ల తర్వాత టాటాల చేతికి ఎయిర్‌ఇండియా

గత వారం రోజుల్లో.. ఫ్రాన్స్‌లో 24లక్షల 43 వేలు , ఇటలీలో 12లక్షల 31 వేలు, బ్రెజిల్‌లో 8లక్షల 24 వేల కేసులు బయటపడ్డాయి. ఇక కొవిడ్‌ మరణాలు కూడా అమెరికాలోనే ఎక్కువగా సంభవించాయి. జనవరి 17నుంచి 23 మధ్యకాలంలో అక్కడ 10వేల 795 మంది కరోనాతో చనిపోయారు. భారత్‌లో 3వేల 343, రష్యాలో 4వేల 792, ఇటలీలో 2వేల 440, బ్రిటన్‌లో 1,888 మంది కొవిడ్‌తో మృతి చెందారు.