India Vs Sri Lanka : శ్రీలంక టూర్.. సారథిగా శిఖర్ ధావన్.. కోచ్‌గా ద్రవిడ్!

వచ్చే నెలలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ లో భారత జట్టు సారథిగా శిఖర్ ధావన్ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. అలాగే జట్టు చీఫ్ కోచ్ గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.

India Vs Sri Lanka : శ్రీలంక టూర్.. సారథిగా శిఖర్ ధావన్.. కోచ్‌గా ద్రవిడ్!

India Vs Sri Lanka

Updated On : June 9, 2021 / 9:39 PM IST

India Vs Sri Lanka : వచ్చే నెలలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ లో భారత జట్టు సారథిగా శిఖర్ ధావన్ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. అలాగే జట్టు చీఫ్ కోచ్ గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. వీరిద్దరిని బీసీసీఐ ఎంపిక చేయనున్నట్టు సమాచారం. మరోవైపు మరో భారత జట్టు విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుంది.

ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్, కోహ్లీ బిజీగా ఉండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్ కు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. భుజం గాయం కావడంతో ఐపీఎల్‌లో ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పూర్తిగా కోలుకోలేదు.

దాంతో శ్రీలంకతో సిరీస్‌కు ధావన్‌కు జట్టు పగ్గాలు అప్పగిస్తారనే టాక్ నడుస్తోంది. శ్రీలంక పర్యటనకు భారత జట్టును ఎప్పుడు ప్రకటిస్తారనేది క్లారిటీ లేదు. వచ్చే వారంలో జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.