Surya Kumar Yadav: ఇండియా మిస్టర్ 360 అని సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టీ20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు సూర్యకుమార్ యాదవ్. 55 బంతుల్లో 117పరుగులు చేసేశాడు. ఈ షార్ట్ ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. విదేశాల్లో అధిక స్కోరు నమోదు చేసి కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశాడు.

Surya Kumar Yadav: ఇండియా మిస్టర్ 360 అని సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు

Suryakumar Yadav

Surya Kumar Yadav: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టీ20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు సూర్యకుమార్ యాదవ్. 55 బంతుల్లో 117పరుగులు చేసేశాడు. ఈ షార్ట్ ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. విదేశాల్లో అధిక స్కోరు నమోదు చేసి కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడుతూ మైదానంలోని అన్ని వైపులా కవర్ చేస్తూ షాట్ బాదాడు.

దీంతో మాజీ ఇండియా ఓపెనర్ ఆకాశ్ చోప్రా రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ను ఇండియన్ మిస్టర్ 360 అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఫీల్డర్లు లేని ప్రాంతం చూసుకుని బౌలర్ ఎలాంటి బంతి విసిరినా షాట్లు కొడుతూనే ఉన్నాడంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

సూర్య సెంచరీ చేసినప్పటికీ.. ఇండియా 198పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 216 టార్గెట్ కు దూరంలో ఉండిపోయింది. మూడు మ్యాచ్ ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో విజయం ఇంగ్లండ్ కు ఊరట అని చెప్పాలి. ఇక ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జులై 12న ప్రారంభం కానుంది.

Read Also : వాటే బ్యాటింగ్.. సూర్యకుమార్ యాదవ్ సెంచరీ