Karnataka Suspense: సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా: డీకే శివకుమార్

డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేసులో...

Karnataka Suspense: సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా: డీకే శివకుమార్

DK Shivakumar

Updated On : May 16, 2023 / 10:00 AM IST

DK Shivakumar: కర్ణాటక (Karnataka ) ముఖ్యమంత్రిగా ఎవరి పేరును ఖరారు చేయాలో తేల్చే విషయంలో ఢిల్లీకి రమ్మని పిలుపువచ్చినా కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ (61) అక్కడకు వెళ్లలేదు. తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతేగాక, జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేసు నుంచి తనను తప్పించారనే విధంగా ఆయన మాట్లాడడం గమనార్హం. సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.

సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. తాను తిరుగుబాటు ఏమీ చేయనని చెప్పారు. “నేను పార్టీలో తిరుగుబాటు చేయను. బ్లాక్‌మెయిల్ చేయను. నేను చిన్న పిల్లాడిని కాదు. నా విజన్, నా విధేయత నాకుంది” అని డీకే శివకుమార్ అన్నారు.

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేసే విషయంపైనే కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు కర్ణాటక సీఎం పేరును కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు నేతలకు కూడా ఆహ్వానం పంపారు.

Karnataka Effect: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై మమతా బెనర్జీ ఫార్ములా