Madhya pradesh : రూ. 11 కోట్ల ఆస్తి విరాళంగా ఇచ్చేసి..భార్యా,కొడుకుతో కలిసి భక్తిమార్గంలోకి అడుగిడిన బంగారం వ్యాపారి

రూ. 11 కోట్ల ఆస్తి విరాళంగా ఇచ్చేసి..భార్యా,కొడుకుతో కలిసి భక్తిమార్గంలోకి పయనించారు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ బంగారం వ్యాపారి.

Madhya pradesh : రూ. 11 కోట్ల ఆస్తి విరాళంగా ఇచ్చేసి..భార్యా,కొడుకుతో కలిసి భక్తిమార్గంలోకి అడుగిడిన బంగారం వ్యాపారి

Mp Jewellery Trader Rakesh Surana Initiation Donates 11 Crores Property

Mp trader rakesh surana initiation donates 11 crores property : సంపాదన సంపాదన ..వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి విరక్తి కలిగింది ఓ ఆభరణాల వ్యాపారికి. ఇదేనా జీవితం?..సంపాదన..కుటుంబం తప్ప ఇంకేమీ లేదా? జీవితమంతా ఇలాగే జీవించాలా? డబ్బువెనుక పరుగులు తీయాలా? అనే ఆలోచన వచ్చింది. కాదు తనకు ఇంకేదో కావాలి అనిపించింది. అదేమిటో బోధపడినట్లుగా తను ఆస్తి అంతా అంటే రూ.11 కోట్ల విలువైన ఆస్తిని గోశాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళంగా రాసిచ్చేసాడు. తన 11 ఏళ్ల కొడుకు, భార్యతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు మధ్యప్రదేశ్‌ కుచెందిన బంగారు ఆభరణాల వ్యాపారి రాకేష్ సురానా.

ఆయన పేరు రాకేష్ సురానా. బంగారం వ్యాపారం చేసేవారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన సురనాకు తన జీవించే జీవితంపై విరిక్తి కలిగింది.ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోవాలనుకున్నారు. అలా  తన రూ. 11 కోట్ల విలువైన ఆస్తిని గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళంగా రాసిచ్చేశారు. భార్య లీనా (36), కుమారుడు అమయ్ (11)తో కలిసి ఇహలౌకిక జీవితాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు.

బాలాఘాట్​లో చిన్న దుకాణంతో రాకేశ్ సురానా ప్రస్థానం మొదలైంది. నిరంతరం శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారు. డబ్బుతో పాటు స్థానికంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సకల సదుపాయాలతో విలాసవంతంగా జీవిస్తున్న ఆయన.. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు. మే 22న జైపూర్‌లో రాకేష్ రానా కుటుంబం దీక్ష తీసుకోనున్నారు. గురుమహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాకేశ్ తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జైన సమాజానికి చెందిన రాకేశ్, భార్య, కుమారుడిని జైన మతస్తులు రథంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాకేశ్ కుమారుడు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక బాట పట్టాలని నిర్ణయించుకున్నామని, కానీ మరీ చిన్నవాడు కావడంతో ఏడేళ్లపాటు ఎదురుచూశామని రాకేష్ తెలిపారు. రాకేశ్ సతీమణి లీనా సురానా మొదట అమెరికాలో చదువుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు యూనివర్సిటీలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. 2017లో ఆమె తల్లి దీక్ష తీసుకున్నారు. కానీ క్యాన్సర్ వల్ల ఆ తర్వాత ఏడు రోజులకే ఆమె చనిపోయారు. లీనా సోదరి నేహ కూడా 2008లోనే దీక్ష చేపట్టారు. ఇప్పుడు ఈ కుటుంబం మొత్తం మే 22న జైపుర్​లో దీక్ష స్వీకరించనుంది.