Naveen Patnaik: బాంబు పేల్చిన సీఎం నవీన్ పట్నాయక్.. మూడో కూటమి అసలే సాధ్యం కాదట

బుధవారం ఒడిశా రాజధాని భుబవేశ్వర్ వచ్చి నవీన్ పట్నాయక్‭తో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు పట్నాయక్. మోదీతో సమావేశం అనంతరం పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి..

Naveen Patnaik: బాంబు పేల్చిన సీఎం నవీన్ పట్నాయక్.. మూడో కూటమి అసలే సాధ్యం కాదట

Naveen Patnaik

Naveen Patnaik: దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తిరుగుతున్నారు. ఇక దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ లేకుండా స్థానిక పార్టీలతో కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కాకుండా.. మూడో కూటమి ప్రయత్నాల్లో ఉన్నారు.

Karnataka Elections 2023 : కాంగ్రెస్ నేతలు అంబులెన్సులు దగ్గర ఉంచుకుంటే బెటర్ : బీజేపీ నేత సెటైర్లు

మూడో కూటమి ఏర్పాటు కోసం నితీశ్ కుమార్ ఇప్పటికే అనేక స్థానిక పార్టీల నాయకుల్ని వ్యక్తిగతంగా కలిశారు. ఇక కేసీఆర్ సైతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. తెలంగాణ దాటి మహారాష్ట్రలో రెండు భారీ బహిరంగ సభలు సైతం ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లోపు మూడో కూటమి అనేది అసలే సాధ్యం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Karnataka Polls: షెట్టర్ కష్టమే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం మళ్లీ ఓడిపోతారట?

బుధవారం ఒడిశా రాజధాని భుబవేశ్వర్ వచ్చి నవీన్ పట్నాయక్‭తో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు పట్నాయక్. మోదీతో సమావేశం అనంతరం పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ‘నాకు సంబంధించినంత వరకు థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం లేదు’ అని పట్నాయక్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

Karnataka Agenda: కర్ణాటక ఎన్నికల సక్సెస్ ఫార్ములా.. ఇండియా లెవెల్‌లో సెట్ అయినట్లేనా?

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తానని శపథం చేసి గత ఏడాది బీజేపీతో తెగతెంపులు చేసుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్.. తన ‘ప్రతిపక్ష ఐక్యత డ్రైవ్’లో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించి వివిధ రంగాల రాజకీయ నేతలను కలిశారు. గతంలో మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌లను కలిశారు. నిన్ననే నవీన్ పట్నాయక్‭ను సైతం కలిశారు.

Karnataka Polls: డబ్బులు ఇచ్చి ఉండాల్సింది.. కర్ణాటక ఎన్నికలపై మాజీ సీఎం కుమారస్వామి హాట్ కామెంట్స్

ఇక తన ఢిల్లీ పర్యటన గురించి పట్నాయక్ స్పందిస్తూ “ప్రధానమంత్రిని కలిశాను. ఒడిశాకు సంబంధించిన అంశాలపై చర్చించాము. పూరీలో ఏర్పాటు చేయాల్సిన అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మాట్లాడాను. భువనేశ్వర్‌లో ఇప్పుడు రద్దీ చాలా పెరిగింది. అందుకే అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ అవసరమని ప్రధానితో చెప్పాను. ఖచ్చితంగా చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు” అని అన్నారు.