Omicron Lockdown : లాక్‌డౌన్ దుష్ప్రచారాలు నమ్మవద్దు-డీహెచ్ శ్రీనివాస రావు

ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణాపాయం లేదని... లాక్ డౌన్ పెడతారనే దుష్ప్రచారాలు నమ్మవద్దని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ధైర్యం చెప్పారు.

Omicron Lockdown : లాక్‌డౌన్ దుష్ప్రచారాలు నమ్మవద్దు-డీహెచ్ శ్రీనివాస రావు

DH Srinivasarao

Omicron Lockdown :  ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణాపాయం లేదని… లాక్ డౌన్ పెడతారనే దుష్ప్రచారాలు నమ్మవద్దని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ధైర్యం చెప్పారు. ప్రజలెవవ్వరూ భయపడవద్దని.. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 9కి చేరాయని… 95 శాతం మందిలో లణాలుకనిపించటంలేదని ఆయన అన్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోటానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని ఆయన చెప్పారు.

దేశంలోని 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని.. ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వలన ఒక్క వ్యక్తే మరణించాడని… భవిష్యత్తులో మరో 10 కొత్తవేరియంట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.
Also Read : Omicron Variant : ఒమిక్రాన్, డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది-కేంద్ర మంత్రి
వ్యాక్సిన్ తీసుకోకపోవటం కూడా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమని ఆయన చెపుతూ… రాష్ట్రంలో ఇప్పటివరకు 9 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని… 11 జిల్లాల్లో వందశాతంవ్యాక్సినేషన్ పూర్తయ్యిందని….56 శాతం మంది రెండు డోసులు వేసుకున్నారని ఆయన తెలిపారు.