Karnataka: “అందుకే ఒప్పుకున్నాం”.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించడంపై డీకే శివకుమార్ సోదరుడు 

డీకే శివకుమార్ కే సీఎం పదవి దక్కుతుందని తాను అనుకున్నానని, కానీ అది జగలేదని అన్నారు.

Karnataka: “అందుకే ఒప్పుకున్నాం”.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించడంపై డీకే శివకుమార్ సోదరుడు 

DK Suresh, DK Shivakumar

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ (Congress) పార్టీ ఇవాళ సిద్ధరామయ్య పేరును ప్రకటించడంపై డీకే శివకుమార్ (DK Shivakumar) సోదరుడు డీకే సురేశ్ (DK Suresh) స్పందించారు. తమ పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తి ఉందని, అయితే, కర్ణాటక ప్రయోజనాల కోసం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

అందుకే డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి ఒప్పుకోవాల్సి వచ్చిందని డీకే సురేశ్ తెలిపారు. డీకే శివకుమార్ కే సీఎం పదవి దక్కుతుందని తాను అనుకున్నానని అది జగలేదని అన్నారు. భవిష్యత్తులో డీకే శివకుమార్ అవుతారేమో చూద్దామని వ్యాఖ్యానించారు. సీఎం కావాలని డీకే శివకుమార్ అనుకుంటున్నారని చెప్పారు. సీఎం ఎంపికలో ఏ సూత్రాన్ని అనుసరించారో స్పష్టతలేదని అన్నారు.

కాగా, సిద్ధరామయ్యను సీఎంగా కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించి, ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపింది. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను డీకే శివకుమార్ పోస్ట్ చేస్తూ… కర్ణాటక భవిష్యత్తు, ప్రజా సంక్షేమానికే తాము ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అందుకు తాము ఐక్యంగా భరోసా ఇస్తున్నామని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Karnataka: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారు: కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన