Nupur Sharma: నుపుర్ శ‌ర్మ జాడ తెలియ‌ట్లేదు: మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి బీజేపీ నుంచి స‌స్పెన్ష‌న్ వేటు ఎదుర్కొంటున్న నుపుర్ శ‌ర్మ జాడ తెలియ‌ట్లేద‌ని మ‌హారాష్ట్ర హోం శాఖ తెలిపింది.

Nupur Sharma: నుపుర్ శ‌ర్మ జాడ తెలియ‌ట్లేదు: మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం

Nupur Sharma

 

Nupur Sharma: మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి బీజేపీ నుంచి స‌స్పెన్ష‌న్ వేటు ఎదుర్కొంటున్న నుపుర్ శ‌ర్మ జాడ తెలియ‌ట్లేద‌ని మ‌హారాష్ట్ర హోం శాఖ తెలిపింది. ఢిల్లీలో ఆమె ఎక్క‌డున్నారో గుర్తించేందుకు నాలుగు రోజులుగా ముంబై పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ వారికి ఆమె జాడ తెలియ‌లేద‌ని పేర్కొంది. నుపుర్ శ‌ర్మ‌పై ముంబైలో కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆమెను అరెస్టు చేయ‌డానికి కావాల్సిన అన్ని ఆధారాలు పోలీసుల వ‌ద్ద ఉన్నాయ‌ని తెలిపారు.

congress: ‘అగ్నిప‌థ్’ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాలి: రాహుల్‌, ప్రియాంకా గాంధీ

ముంబైతో పాటు థానే పోలీస్ క‌మిష‌న‌రేట్‌లోనూ నుపుర్ శ‌ర్మ‌పై కేసు న‌మోదైంది. నుపుర్ శ‌ర్మ‌కు మెయిల్ ద్వారా ఇప్ప‌టికే పోలీసులు స‌మ‌న్లు పంపారు. తాజాగా, ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నేరుగా వెళ్లారు. అయితే, ఆమె ఎక్క‌డ ఉన్నారో వారు గుర్తించ‌లేక‌పోతున్నారు. నురుప్ శ‌ర్మ కేసు విష‌యంలో ఢిల్లీ పోలీసులు మ‌హారాష్ట్ర పోలీసుల‌కు స‌హ‌క‌రించ‌ట్లేద‌ని మ‌హారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ చెప్పారు. కాగా, నుపుర్ శ‌ర్మ చేసిన అనుచిత వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ప‌లు ముస్లిం మెజారిటీ దేశాలు కూడా ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి.